Natyam ad

కడప బెంగళూరు రైల్వే లైన్ కు నిధులు కేటాయించాలి

కడప జిల్లా కేంద్రంలో హంసఫర్ రైలును ఆపాలి


కడప ముచ్చట్లు:


భారత దేశ స్వతంత్ర చరిత్రలో రాయలసీమలో బ్రిటిష్ వాళ్ళు వేసిన రైల్వే లైన్ తప్ప మన ప్రభుత్వం వారు ఒక్క రైలు మార్గం కూడా పూర్తి చేయకపోవడం సిగ్గుగా లేదా అని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్ రెడ్డి అన్నారు.
 మంగళవారం కడప రైల్వే మేనేజర్ నరసింహ రెడ్డి ని కలసి వినతి పత్రం సమర్పించారు, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  రైల్వే నిధులు, పనులు పూర్తి ఆ మాటలు దేవుదేరుడు, ఒకే కుటుంబ సభ్యులు సోదరులు ముఖ్యమంత్రి, పార్లమెంట్ సభ్యులు  సొంత జిల్లా కేంద్రమైన కడప రైల్వే స్టేషన్లో హంసఫర్ రైలు ఆగకుండా వెళుతుందంటే ముఖ్యమంత్రి  వారి సోదరుడికి  ఏ పాటి గౌరవం ఉందో అద్దం పడుతుందని ఆయన తెలిపారు.ఆనాటి ప్రతిపక్ష నేత  ప్రస్తుత ముఖ్యమంత్రి 25 మంది ఎంపీలను గెలిపిస్తే కేంద్రం మెడలు వంచి మనకు రావలసిన నిధులను పొందగలమని చెప్పిన  ఈయన, 25 కాదు 32 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ఎన్ని రైల్వే లైన్లు పూర్తి చేశావో చెప్పాలని ఆయన కోరారు.

 

 


 కడప జిల్లా వాసుల చిరకాలక కోరిక అయిన కడప బెంగళూరు, కడప విజయవాడ నెల్లూరు మీదుగా, ఇంతవరకు మోక్షం లభించలేదు ఈ బడ్జెట్ లో నైనా కేంద్ర ప్రభుత్వం రాయలసీమకు న్యాయంగా రావలసిన నిధులను కేటాయించా లని ఆయన డిమాండ్ చేశారు75 ఏళ్ల స్వతంత్ర చరిత్రలో రైల్వేలో  కేంద్రం రాయలసీమకు తీరని అన్యాయం తలపెట్టారు ప్రశ్నించే గొంతు మచ్చుకైనా కనపడలేదు వినపడలేదు ప్రజలు ఉద్యమ బాట పట్టక మునుపే రాయలసీమలోని పెండింగ్ లో ఉన్న అన్ని రైల్వే పనులను పూర్తిచేయాలని, కడపలో హంసఫర్ రైలును నిలిపి ముఖ్యమంత్రి గౌరవం నిలబెట్టాలని ఆయన తెలిపారు కార్యక్రమంలో   ఆర్ ఎస్ వై ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, ఆర్ సి పి నగర కార్యదర్శి  మక్బూల్ బాషా, నగర కార్యదర్శి వర్గ సభ్యులు చేపల సుబ్బరాయుడు, లక్ష్మీదేవి, తస్లిం, ప్రసాద్, ప్రతాప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Funds should be allocated for the Kadapa Bangalore railway line

Post Midle