ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పోడిగించాలి
విజయవాడ ముచ్చట్లు:
ఎస్. సి, ఎస్.టి సబ్ ప్లాన్ నిధులు మరో పది సంవత్సారాలు పొడిగించాలని దళిత సంఘాలు డిమాండ్ చేశాయి. ఇందులో భాగంగా దళిత హక్కుల పోరాట సంఘం, కుల వివక్ష పోరాట సంఘం మరియు ఇతర దళిత సంఘాల ద్వారా ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖా మంత్రి మేరుగ నాగార్జునకి విజయవాడ లో వినతి పత్రం అందజేయటం జరిగింది. ఈ సందర్భంగా అన్ని జిల్లాల్లోనూ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాలకు సబ్ ప్లాన్ పొడిగించాలని కోరుతూ వినతి పత్రాలు సమర్పించారు. విశాఖలోని డాబా గార్డెన్స్ వద్ద అంబేద్కర్ విగ్రహా నికి దళిత సంఘాల నాయకులు మెమరాండం సమర్పించారు. అనం తరం దళిత సంఘాల జేఏసీ నాయ కుడు ప్రభాకర్ మాట్లాడుతూ గతంలో ఎస్సీ ఎస్టీలకు ప్రత్యేక నిధులు ఏర్పా టు చేస్తూ విధించిన కాలపరి మితి ముగిసిన నేపథ్యంలో దానిని పొడిగిం చాలని కోరారు.అదేవిధంగా దళిత గిరిజనుల కోసం ప్రత్యేకంగా ఒక సంక్షే మ బోర్డు ఏర్పాటు చేసి నిధులు కేటా యించాలని డిమాండ్ చేశారు.
Tags; Funds should be raised for SC and ST sub plan

