Natyam ad

బీసీ ఫెడరేషన్లకు నిధులు విడుదల చేయాలి

కళ్ళకుగంతలు కట్టి నిరసన తెలిపిన నాయకులు

మంచిర్యాల ముచ్చట్లు:

 

మంచిర్యాల్ పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద బీసీ ఫెడరేషన్లకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో కళ్ళకు గంతలతో నిరసన వ్యక్తం చేయడం జరిగింది.ఈ సందర్భంగా బీసీ సంఘాల ఐక్యవేదిక జిల్లా కన్వీనర్ గుమ్ముల శ్రీనివాస్ మాట్లాడాతురాష్ట్ర జనాభాలో 56% బీసీ జనాభా ఉంటే ఫెడరేషన్లకు నిధులు విడుదల చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఫెడరేషన్లకు ఎలాగూ నిధులు విడుదల చేయలేదు నీళ్లు నిధులు నియామకాలపై ఏర్పాటు తెలంగాణ రాష్ట్రంలోనైనా వృత్తి కులాలకు ఉత్పత్తి కులాలకు న్యాయం జరుగుతుందేమోనని ఎవత్ బీసీ సమాజం రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్ని సాధించడంలో కీలక పాత్ర పోషించిన బీసీలకు స్వరాష్ట్రంలో కూడా నిరాశయ ఎదురవుతుంది ఒకపక్క కార్పొరేషన్లకు రుణాలు విడుదల కాక సతమతం అవుతున్న తరుణంలో మరోపక్క ఫెడరేషన్లకు నిధులు విడుదల చేయక పోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం టిఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి 8 సంవత్సరాల అవుతున్న ఫెడరేషన్లకు నిధుల విడుదలపై ప్రభుత్వం ప్రకటనకే పరిమితం అవుతుంది తప్ప నిధులు విడుదల చేసిన దాఖలాలు లేవు. ఇప్పటికైనా కులవృత్తులకు ప్రభుత్వం చేయూతని అందించి ఆదుకోవాలని కోరుతున్నాం లేనిపక్షంలో రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు హెచ్చరిస్తున్నాం. కార్యక్రమంలో పాల్గొన్నవారు బీసీ సంఘాల ఐక్యవేదిక కో కన్వీనర్ సంఘం లక్ష్మణ్ నాయకులు రాస మల్ల కుమార్ శ్రీపతి రాములు చంద్రగిరి చంద్రమౌళి చొప్పరి రామస్వామి,ఆరందుల రాజేశం కీర్తి బిక్షపతి,మాణిక్యరావు వెంకటేశ్వర్లు మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Funds should be released to BC federations

Post Midle