62 ఏళ్ల తర్వాత అంత్యక్రియలు

Date:25/07/2020

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

ఒక మానవుడు మరో మనిషిని చంపి తినడమే అసంభవం. అలాంటిది థాయిల్యాండ్ లో బతుకు జీవుడా అంటూ వచ్చిన ఓ వ్యక్తి ఏకంగా ఎనిమిది మంది చిన్నారులను చంపేసి వారిని భోజనంలా తినేశాడు. అతడు ఆకలికి తట్టుకోలేకపోయాడు. అయితే వరుసగా చిన్నారులు కనిపించకపోవడంతో దర్యాప్తు చేయడంతో అతడు చేసే ఘోరాలు వెలుగులోకి వచ్చాయి. అలాంటి వ్యక్తి చివరకు మరణించాడు. అయితే అతడి అంత్యక్రియలు మాత్రం ఏకంగా 60 ఏళ్ల తర్వాత చేస్తున్నారు. ఈ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. చైనాకు చెందిన సీ కీ సైనికుడిగా విధులు పని చేసేవాడు. రెండో ప్రపంచ యుద్ధంలో చైనా తరఫున పోరాడాడు. అయితే ఆ యుద్ధంలో జపాన్ సైన్యం చైనా బలగాలను చుట్టుముట్టినప్పుడు సైనికుడిగా ఉన్న సీ కీ తన ప్రాణాల్ని కాపాడుకోవటం కోసం థాయిలాండ్ పారిపోయాడు. ఆ సమయంలో అతడు తినడానికి ఏమి లేవు. చుట్టూ చనిపోయి ఉన్న సైనికుల మృతదేహాలు తప్ప ఏమి కనిపించలేదు. దీంతో అతడు ఆకలికి తట్టుకోలేక తోటి సైనికుల మృతదేహాలను తినడం ప్రారంభించాడు. ఆ శవాలను తిని అతడు ఆకలి తీర్చుకున్నాడు. ఆ విధంగా అతడు మనుషులను తినడం అలవాటు చేసుకున్నాడు. అలా తప్పించుకుని అలా థాయింలాడ్ కు వెళ్లాడు. అక్కడ ఓ ఇంట్లో పని చేసుకుంటూ కాలం గడుపుతున్నాడు. మనుషులు తినడం అలవాటైన సీ కీ మరికొందరిని తినాలనుకున్నాడు. ఈ క్రమంలో అతడు చిన్నారులను తినడం మొదలుపెట్టాడు. అతడు పని చేస్తున్న ఇంటి పరిధిలో ఏడుగురు పిల్లలను తినేశాడు. ఈ విషయం తెలియని వారి కుటుంబసభ్యులు పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆ చిన్నారుల మృతదేహాలు లభించాయి. కానీ చిన్నారుల అవయవాలు కనిపించకుండాపోయేవి. ఈ వరుస ఘటనలు స్థానికంగా ఆందోళన కలిగించాయి.

 

స్థానికులు తమ చిన్నారుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండేవారు. ఏడుగురు పిల్లలు చనిపోవటం.. వాటిలో అవయవాలు కనిపించకుండా పోవటంతో పోలీసులు కేసును తీవ్రంగా పరిగణించి దర్యాప్తు మొదలుపెట్టారు.1958వ సంవత్సరంలో రేయాంగ్ ప్రావిన్స్ లో ఓ పిల్లవాడి శవాన్ని దహనం చేస్తుండగా సీ కీ రెడ్ హ్యాండెండ్ పట్టుబడ్డాడు. దీంతో పోలీసులు అతడిని అనుమానించి కాల్చి చంపారు. అయితే చిన్నారుల మృతదేహాలు తినడంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దీంతో ఆ ప్రత్యేక రసాయనాల్లో భద్రపరిచి మమ్మీగా మార్చి సిరిరాజ్ ఆస్పత్రి మెడికల్ మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచారు. అయితే అతడి మృతదేహాన్ని మమ్మీగా ప్రదర్శనకు పెట్టటాన్ని మానవ హక్కుల సంఘాలు వ్యతిరేకించాయి. అతడిని అలా ప్రదర్శనకు పెట్టకూడదని ఇది సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని పేర్కొన్నాయి.

సీ కీ మమ్మీని ప్రదర్శనలోంచి తీసేయాలని డిమాండ్ చేశాయి. దీంతో సీ కీ మమ్మీ సిరిరాజ్ ఆస్పత్రిలోనే ఉండేది. దీనిపై కోర్టు తీర్ప ఉత్తర్వుల ప్రకారం అంటే 62 సంవత్సరాల తరువాత సీ కీ మమ్మీకి గురువారం (జులై 23 2020)న థాయ్ లాండ్ కు ఉత్తరాన 20 మైళ్ల దూరంలో ఉన్న నోంతబురి ప్రావిన్స్ లోని ఒక ప్రాంతంలో బౌద్ధ సంప్రదాయం ప్రకారం అంత్యక్రియలు నిర్వహించారు. అయితే సీ కీ సంబంధించిన కుటుంబసభ్యులు.. బంధువులు ఎవరూ రాలేదు.

 

చంద్రబాబు డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్

Tags:Funeral after 62 years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *