కరోన మృతదేహాలకు అంత్యక్రియలు చేయడం పూర్వజన్మ సుకృతం

రామసముద్రం ముచ్చట్లు:

 

 

కరోనతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు చేయడం తమకు పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నట్లుగా హిందూ జాగరణ సమితి సభ్యులు అన్నారు. బుధవారం మండలంలోని కెసిపల్లి పంచాయతీ గుంతయంబాడి గ్రామానికి చెందిన మొసలామణి గత కొద్ది రోజుల క్రితం కరోన సోకింది. దింతో వైద్యులు మదనపల్లికి రెఫర్ చేశారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గడంతో తిరుపతి రూయకు తరలించారు. అక్కడ మొసలామణి చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ క్రమంలో మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. అంత్యక్రియలు నిర్వహించడానికి పుంగనూరుకు చెందిన హిందూ జాగరణ సమితి సభ్యులకు సమాచారం అందించారు. సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, ఆర్. శ్రీనివాసులురెడ్డి, జయచంద్ర, మునస్వామి ఆధ్వర్యంలో హిందూ జాగరణ సమితి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ యావత్తు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోన మహమ్మారి దెబ్బకు ఎంతో మంది మృత్యువాతన పడుతున్నారన్నారు. స్వంత వాళ్లు సైతం కరోనతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించడానికి భయపడుతుంటే హిందూ జాగరణ సమితి సభ్యులు మేము ఉన్నాం అంటూ ముందుకు వచ్చి అంత్యక్రియలు నిర్వహించడం అభినందించదగ్గ విషయమని కొనియాడారు. ఇలాంటి మహోత్తర కార్యక్రమాలను నిర్వహిస్తున్న హిందూ జాగరణ సమితి సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ అంత్యక్రియల్లో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, డిజిటల్ అసిస్టెంట్ భారతమ్మ, మహిళా పోలీస్ గౌతమి, ఏఎన్ఏం సుగుణమ్మ, ఆశ వర్కర్లు రాధమ్మ, మంజుల, వాలింటర్లు పాల్గొన్నారు.

కల్పవృక్ష వాహనంపై శ్రీ రాజ‌మ‌న్నార్‌ అలంకారంలో శ్రీ‌ పసన్న వేంకటేశ్వరుడు

Tags: Funerals for corona corpses are a preconceived notion

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *