అనాథ శవాలకు ఆత్మ బంధువులై అంతిమ సంస్కారం.
తిరుపతి ముచ్చట్లు:
తిరుపతి దివ్యక్షేత్రం అలిపిరి గరుడ విగ్రహం వద్ద ఎవరులేని అనాథలు శవాలు విగతజీవులుగా పడివున్నాయని ముస్లిం కోవిడ్-19 జేఏసీ అధ్యక్షులు ఇమామ్ గారికి సమాచారం అందగా , *డిప్యూటీ మేయర్ భూమన అభినయ్ గారి సహకారంతో * స్థానిక అలిపిరి పోలీస్ వారికి సమాచారం అందించి అక్కడికి చేరుకొని ఎవరూ ముందుకు రాకపోవడంతో వారినితిరుపతి యూనైటెడ్ ముస్లిం అసోసియేషన్ ఉచిత అంబులెన్సు ద్వారా స్థానిక హిందూస్మశాన వాటికకు తరలించి హిందూ సంప్రాదయం ప్రకారం గౌరవప్రదంగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు ముస్లిం జేఏసీ బృందం.కరోనా మహమ్మారి మొదటి వేవ్ నుండి ఉచితంగా నిర్వీర్యమయంగా ఈ సేవలు కొనసాగుతున్నాయన్న ఎక్కడైనా ఇటువంటి సంఘటనలు జరిగితే తమకు 9985864305 ఫోన్ నెంబర్ ద్వారా సమాచారం అందించి నిజమైన మానవత్వం చాటుదామని ఈ సందర్భంగా ముస్లిం జేఏసీ అధ్యక్షులు, తిరుపతి నగరపాలక సంస్థ కో -ఆప్షన్ సభ్యులు,వైయస్ఆర్ సీపీ యువజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ ఇమామ్ సాబ్ తెలిపారు.ఈ సేవ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పి.నరేంద్రనాథ్ , బి.సుజాత , చాను బాషా , గంగా మోహన్ , షేక్ సులేమాన్ , ముబారక్ , ద్వారకా , సతీష్ , ఉమాపతి , మదన్ మరియు మునిసిపల్ శానిటరీ ఇంఛార్జ్ చెంచయ్య తదితరులు పాల్గొన్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Funerals for soul corpses for orphaned corpses.