మరింత తగ్గిన ఎస్ బీఐ  హోంలోన్స్

Date:09/02/2019
చెన్నై ముచ్చట్లు:
గృహ రుణదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుభవార్త తెలిపింది. గృహరుణాలపై వడ్డీరేటును 5 బేసిస్‌ పాయింట్ల (0.05 శాతం) మేర తగ్గించినట్లు పేర్కొంది. అయితే ఇది కేవలం రూ.30 లక్షల వరకు తీసుకునే గృహరుణాలకు మాత్రమే వర్తిస్తుందని  తెలిపింది. ద్రవ్య, పరపతి విధాన సమీక్షలో రెపోరేటును 25 బేసిస్‌ పాయింట్లు తగ్గించి, 6.25 శాతానికి పరిమితం చేస్తున్నట్లు ఆర్‌బీఐ  ప్రకటించిన మరుసటిరోజే ఎస్‌బీఐ ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాక వెంటనే ఈ నిర్ణయం అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ ఛైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ వెల్లడించారు. ఇతర బ్యాంకులతో పోలిస్తే ఎస్‌బీఐలో డిపాజిట్ రేట్లు తక్కువగా ఉన్నాయని.. ఒకవేళ డిపాజిట్ రేట్లు తగ్గిస్తే.. ఎంసీఎల్ఆర్ ఆధారిత రుణరేట్లను కూడా తగ్గించాల్సిందేనని ఆయన తెలిపారు. ప్రస్తుతం గృహ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించినందున.. ఎస్‌బీఐ ఏడాది కాలావధి ఎంసీఎల్‌ఆర్‌ రేట్లలోనూ కోత విధించాలన్నారు. ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ రేటును ఏప్రిల్‌లోపు అమలు చేయడం సాధ్యపడదని.. దీనికి సంబంధించిన నిబంధనలు ఇంతవరకు వెలువడకపోవడమే ఇందుకు కారణమని రజనీశ్‌ తెలిపారు. మరోవైపు బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర కూడా ఆరు నెలల కాలావధి ఎంసీఎల్‌ఆర్‌పై వడ్డీరేటును 0.05 శాతం తగ్గించింది.
Tags:Further reduced SI Hollins

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *