పుంగనూరులో గడప గడపకు హారతులు -ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు మంగళహారతులు ఇస్తున్నారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తో కలసి గడప గడప కార్యక్రమాన్ని చెన్నూరు, గాంధిపురం, పూజగానిపల్లె, మోదుగులపల్లె గ్రామాల్లో నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి సంక్షేమ బావుట పుస్తకాలను పంపిణీ చేసి పథకాల పంపిణీ తీరును వివరించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ మండలంలోని 22 పంచాయతీల్లోను ప్రజలకు అన్ని పథకాలను అందించడం జరిగిందన్నారు. గతంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పేదల ప్రభుత్వంగా చరిత్ర సృష్టించిందని కొనియాడరు. ముఖ్యంగా సచివాలయాల ద్వారా ఎప్పటికప్పుడు ప్రజల ముంగిట సమస్యలు పరిష్కరించడం జరుగుతోందన్నారు. రైతు భరోసాల ద్వారా రైతులకు ఎప్పటికప్పుడు సహాయ సహకారాలు అందించడం జరుగుతోందన్నారు. మూడేళ్ల పాలనలో ప్రజలు సంతోషంగా ఉంటు , వైఎస్సార్‌సీపీ నాయకులకు నీరాజనాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి పిఏ చంద్రహాస్‌, సర్పంచ్‌ మోహన్‌, ఎంపీటీసీ సురేంద్ర, వైఎస్సార్‌సీపీ నాయకులు పాపిరెడ్డి, కమతంపల్లె రమణ, రాజశేఖర్‌రెడ్డి, రామకృష్ణ, చంద్రారెడ్డి యాదవ్‌, బాబు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Gadapa Gadapa in Punganur – MP Akkisani Bhaskar Reddy

Post Midle
Natyam ad