పుంగనూరులో ప్రజలతో మమేకమైయ్యేందుకే గడప గడపకు

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజలతో సన్నిహితంగా మమేకమైయ్యేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌ తెలిపారు. మంగళవారం మండలంలోని ముడిబాపనపల్లెలో ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి ఆయన గడప గడపకు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగనన్న సంక్షేమ బావుట పుస్తకాలను ప్రజలకు పంపిణీ చేసి, ప్రభుత్వ పథకాలు గురించి వివరించారు. వెంకటరెడ్డి యాదవ్‌ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన సచివాలయలు, వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజల సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారమౌతోందన్నారు. కులమతాలకు, పార్టీలకు అతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు అందించడంలో పుంగనూరు ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు. అలాగే గ్రామీణప్రాంతాల్లోని ప్రజలు పట్టణాలను మరచి సమస్యలు లేకుండ పల్లెల్లో సంతోషంగా జీవిస్తున్నారని కొనియాడారు. ఇలాంటి మహ్గన్నత కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికి ప్రతి ఒక్కరు అండగా నిలవాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి పీఏ చంద్రహాస్‌, ఎంపీడీవో లక్ష్మీపతి, వైస్‌ ఎంపీపీ ఈశ్వరమ్మ, జెడ్పిటీసీ జ్ఞానప్రసన్న , ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, కౌన్సిలర్‌ నరసింహులు, మాజీ జెడ్పిటిసి వేమన్న, వైఎస్సార్‌సీసీ నాయకులు జయరామిరెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌, రమణ, బాబు, తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Gadapa Gadapa is not about meeting people in Punganur

Post Midle
Natyam ad