గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యే మేడా, చైర్మన్ ఆకేపాటి

వైఎస్ ఆర్ సీపీ లో చేరిన 25 టిడిపి కుటుంబాలు

ఒంటిమిట్ట ముచ్చట్లు:


మండలంలోని నరవకాటిపల్లి పంచాయితీ నందు  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్ పి  చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు నిర్వహించారు ఈసందర్భంగా వారు మాట్లాడుతూ నియోజకవర్గం లో ఎక్కడికి వెళ్ళినా అపూర్వ స్పందన ప్రజల అభిమానం కనపడుతోందన్నారు  గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఏ గడప ఎక్కినా, ఏ ఆడపడుచును పలకరించినా  తమకు తమ బిడ్డ, తమ అన్న సీఎం జగన్  వల్ల ఎంతో లబ్ధి పొందామని మళ్లీ మళ్లీ ఆయనే మాకు సీఎంగా కావాలని ఎమ్మెల్యేగా మీరే రావాలని ఆకాంక్షించిస్తున్నారని చెప్పారు ఇందులో భాగంగానరవకాటపల్లిలో తెలుగుదేశం పార్టీకి చెందిన 25 కుటుంబాల వారు ఒంటి మిట్ట ఎంపీపీ గడ్డం జనార్దన్ రెడ్డి  నరవకాటపల్లి ఎంపీటీసీ ప్రతినిధి బ్యాంకు శివారెడ్డి బొడ్డె రమణ  ఆధ్వర్యంలో గురువారం  వై.ఎస్.ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. చేరిన వారిలో మల్లేష్ యాదవ్, పులి మల్లేషు, ఎర్రయ్య, సుబ్రహ్మణ్యం, ఓబులేషు, ఓబుల సుబ్బయ్య, అను పుల్లయ్య, పిచ్చయ్యలు ఉన్నారు ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, జడ్ పి చైర్మన్ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిలు  వారికి పార్టీ కండువా వేసి వారిని సాధారంగా పార్టీ లోకి  ఆహ్వానించారు  ఈ కార్యక్రమంలో  ఒంటి మిట్ట ఎంపీపీ గెడ్డం జనార్దన్ రెడ్డి, రాష్ట్ర డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి,రాష్ట్ర  డైరెక్టర్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, నరవకాటపల్లి ఎంపీటీసీ ప్రతినిధి బ్యాంకు శివారెడ్డి నరవకాటపల్లి  సర్పంచి లక్ష్మీ నరసమ్మ , బొడ్డే రమణ, శ్రీను, నారాయణ, మనోహర్ రెడ్డి, బ్రహ్మ రెడ్డి, నరావాకాటిపల్లి గంగిరెడ్డి,యం వెంకట్ రెడ్డి, శ్రీధర్ ,హస్తవరం ఉమా మహేశ్వర్ రెడ్డి  పాలగిరి మల్లికార్జున్ రెడ్డి , నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, సర్పంచులు ఎంపీటీసీ లు సచివాలయం సిబ్బంది , వాలెంటర్ల్లు, నియోజకవర్గ వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Gadapa Gadapa is the MLA Meda, the chairman of our government

Leave A Reply

Your email address will not be published.