పుంగనూరులో సమస్యలు తీర్చేందుకే గడప గడపకు-మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా

పుంగనూరు ముచ్చట్లు:

ప్రతి ఇంటిలో ఉన్న సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకే గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. మంగళవారం కమిషనర్‌ నరసింహప్రసాద్‌, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్దిన్‌షరీఫ్‌, వార్డు కౌన్సిలర్లు గంగులమ్మ, త్యాగరాజు తో కలసి పర్యటించారు. చైర్మన్‌ మాట్లాడుతూ ఎలాంటి సమస్యలు ఉన్నా వినతిపత్రాలు అందజేయాలన్నారు. అర్హులుగా ఉండి, ప్రభుత్వ పథకాలు అందకుండ పోతే తక్షణమే మంజూరు చేయిస్తామన్నారు. ప్రతి ఒక్కరిని అభివృద్ధి చేయడమే ప్రభుత్వ ఆశయమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు రేష్మా, మమత, అమ్ము, కిజర్‌ఖాన్‌, నరసింహులు, జేపి.యాదవ్‌, కాళిదాసు, భారతి, తుంగామంజునాథ్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Gadapa Gadapaku-Municipal Chairman Aleem Basha to solve problems in Punganur

 

Natyam ad