Natyam ad

పుంగనూరులో గడప గడపకు మహిళలు

పుంగనూరు ముచ్చట్లు:

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి మహిళలు అధిక సంఖ్యలో హాజరైయ్యారు. శుక్రవారం మున్సిపల్‌ చైర్మన అలీమ్‌బాషా తెలిపారు. కమిషనర్‌ నరసింహప్రసాద్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌తో కలసి పట్టణంలోని 21వ వార్డులో పర్యటించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటిలోని ఆర్‌పీలు, సీసీలు, మహిళలు కలసి ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమబావుట పుస్తకాలను పంపిణీ చేసి, సంక్షేమ పథకాలను వివరించారు. చైర్మన్‌ మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు సచివాలయాల పరిధిలో వచ్చిన సమస్యలను గుర్తించి , మౌళిక వసతులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. కాలువలు, రోడ్లు, విద్యుత్‌ స్తంభాల ఏర్పాటు చేపట్టామన్నారు. అలాగే విస్తరణ ప్రాంతాలలో కూడ విద్యుత్‌లైన్లు, పైపులైన్లు ఏర్పాటు చేశామన్నారు. గడగప గడపకు వెళ్లి వ్యక్తి గత సమస్యలను కూడ తెలుసుకుని పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.మహిళలు అధిక సంఖ్యలో గడప గడపకు కార్యక్రమంలో పాల్గొనడం శుభపరిణామమన్నారు. మహిళలు తమంతకు తాముగా ఇంటింటికి వెళ్లి చైతన్యం కలిగించి, ప్రభుత్వ పథకాలను వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, వైస్‌ చైర్మన్లు లలిత, నాగేంద్ర, కౌన్సిలర్లు కసీరున్నిసా, నయీంతాజ్‌, భారతి, రెడ్డెమ్మ, అమ్ము, అర్షద్‌అలి, కిజర్‌ఖాన్‌, నరసింహులు, రేష్మా, కాళిదాసు, మనోహర్‌, సాజిదా తదితరులు పాల్గొన్నారు.

Post Midle

 

Tags: Gadapa Gadappa women in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.