Natyam ad

పుంగనూరులో గడప గడపకు మహిళలు

పుంగనూరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం మున్సిపాలిటిలో చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్రజానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా మున్సిపాలిటిలోని ఆర్‌పిలు, సీసీలు , చైర్మన్‌తో కలసి ఇంటింటికి వెళ్లి జగనన్న సంక్షేమ బావుట బుక్‌లెట్లను పంపిణీ చేసి, సంక్షేమ పథకాల జాబితా చదివి వినిపించారు.ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై చర్చించారు. పథకాలు అందుతున్నాయంటు ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు. చైర్మన్‌ మాట్లాడుతూ గడప గడపకు కార్యక్రమంలో మహిళలు ప్రతి రోజు ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించడంతో ప్రజల్లో పథకాల పట్ల మరింత అవగాహన పెరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పెద్దిరెడ్డి పీఏ చంద్రహాస్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు నాగేంద్ర, లలిత, కౌన్సిలర్లు సాజిదాబేగం, అర్షద్‌అలి, అమ్ము, కిజర్‌ఖాన్‌, కమలమ్మ, జయభారతి, యువకుమారి, నరసింహులు, కాళిదాసు, ఆదిలక్ష్మీ, యువకుమారి , మక్కాకమిటి డైరెక్టర్‌ ఖాదర్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Gadapa Gadappa women in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.