70 ఏళ్ల తర్వాత గద్దర్ ఓటు

Gaddar voted after 70 years

Gaddar voted after 70 years

Date:07/12/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ఎన్నికల్లో పలు ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. 70 ఏళ్లుగా పోలింగ్‌కు దూరంగా ఉన్న ప్రజా యుద్ధనౌక గద్దర్ తన జీవితంలో తొలిసారిగా ఓటు వేశారు. సికింద్రాబాద్ పరిధిలోని ఆల్వాల్‌ వెంకటాపురం పోలింగ్ కేంద్రంలో గద్దర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణితో కలిసి వచ్చి ఓటు వేశారు. గతంలో భువనగిరిలో బ్యాంక్ ఉద్యోగిగా పనిచేసే సమయంలో గద్దర్.. మావోయిస్టు కార్యకలాపాల పట్ల ఆకర్షితులయ్యారు. నాటి నుంచి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. తన జీవితంలో ఒక్కసారి కూడా ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోకపోవడం గమనార్హం. ఏడాది కిందట గద్దర్ తొలిసారిగా రాజకీయాల పట్ల ఆసక్తి చూపారు. మావోయిస్టు పార్టీ రాజాకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయం తీసుకొన్నట్టు ఆయన అప్పట్లోనే ప్రకటించారు. ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆసక్తిని వ్యక్తం చేశారు. గజ్వేల్ నుంచి స్వతంత్య్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. ఎన్నికల్లో ఆయన ప్రజా కూటమి తరఫున ప్రచారం చేశారు. ప్రజాస్వామ్యంలో ఓటు విలువ చాలా గొప్పదని.. దాన్ని సరిగి వినియోగించుకోవాలని గద్దర్ పిలుపునిచ్చారు. ఓటు రాష్ట్ర రాజకీయ నిర్మాణానికి రూపమని.. ఓట్ల విప్లవం వర్ధిల్లాలని పేర్కొన్నారు. అంబేద్కర్ ఆశయాలను యువత అందిపుచ్చుకోవాలని సూచించారు. ఓటు వేయడానికి వచ్చిన సమయంలో గద్దర్ చేతిలో అంబేద్కర్ ఫొటో ఉండటం గమనార్హం..
Tags:Gaddar voted after 70 years

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *