ప్రసూతి హాస్పిటల్ లో మైనర్ బాలికను పరామర్శించిన మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి

తిరుపతి ముచ్చట్లు:

తిరుపతి ముత్యాలరెడ్డి పల్లె పోలీస్ స్టేషన్ పరిధిలో మెనర్ బాలికపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారం కు పాల్పడిన ఘటన వెలుగులోకి వచ్చింది. పోలీసులు పోక్సో చట్టం కింద నిందితులను అరెస్టు చేసి రిమాండు పంపడం జరిగింది. మైనర్ బాలికను చికిత్స నిమిత్తం ప్రసూతి ఆసుపత్రి కి తరలించారు.విషయం తెలుసుకున్న మహిళా కమిషన్ సభ్యురాలు ప్రసూతి ఆసుపత్రి కి చేరుకొని చికిత్స పొందుతున్న మైనర్ బాలికను పరామర్శించి, ఆరోగ్య పరిస్థితి ని వైద్యుల ద్వారా అడిగి తెలుసుకున్నారు ,ఈ సందర్భంగా గజ్జల లక్ష్మి మీడియా తో మాట్లాడారు.ఎన్ని చట్టాలు వచ్చినా.., కొంతమంది కామాందులు పసిబిడ్డలను, మహిళలను చెరపట్టి బెధిరింపులకు గురిచేసి, లొంగదీసుకోవడం పరిపాటి గా మారింది.., ఇలాంటి సంఘటనలకు పాల్పడిన వారిపట్ల చట్టం కఠినంగా వ్యవరించి, ఉరిశిక్ష ను విదించాలని కోరారు .

 

 

. మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టి కి తీసుకెళ్ళి, మైనర్ బాలికకు , వారి కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలబడటానికి కృషి చేస్తామని గజ్జల లక్ష్మి బరోసా ఇచ్చారు.మహిళలు ధైర్యం గా సమస్యలను ఎదుర్కోవాలని ,ఎలాంటి భయాందోళనకు ,బెదిరింపులకు గురికావొద్దని, బంగారు భవిష్యత్తు ను ఛిద్రం కాకుండా జాగ్రత్త వహించాలని గజ్జల లక్ష్మి తెలిపారు”దిశ” యాప్ ను ముఖ్యమంత్రి మహిళామ తల్లుల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చారని, మహిళల అరచేతిలో అస్త్రం ” దిశ” అని…, ఆపద సమయంలో మరవరాదని రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి కోరారు. ఆమె వెంట ICDS సిబ్బంది ,చైల్డ్ హెల్ప్ లైన్ సిబ్బంది, మహిళా పోలీస్ వారు పాల్గొన్నారు.

Tags:Gajjala Lakshmi, a member of the Women’s Commission, visited the minor girl in the maternity hospital

Leave A Reply

Your email address will not be published.