మానవత్వం చాటుకున్న మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి

నెల్లూరు ముచ్చట్లు:

నెల్లూరు జిల్లా కావలి కూతవేటు దూరంలో తెట్టు సమీపంలో రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు ప్రాణాపాయ స్థితిలో పట్టపగలు నడిరోడ్డు పైన పడిపోయి ఉన్నారు. ఎవరు పట్టించుకోకుండా ఎవరి దారిలో వారు చాలా వేగంగా వెళ్ళిపోతున్న సమయంలో తన విధుల నిమిత్తం విజయవాడకు అదే దారిలొ వెళ్తోన్న గజ్జల లక్ష్మి ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని గమనించి తన వాహనాన్ని ఆపి అత్యవసర చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ కి కాల్ చేసి క్షతగాత్రులకు అత్యవసర వైద్యం అందించాలని కోరింది.అదే విధంగా కావలి సిఐ కి ఫోన్ చేసి ప్రమాద సంఘటన గురించి తెలియజేశారు. అదే విధంగా మంచినీళ్లతో వారి మొహాన్ని కడిగి అధిక రక్తస్రావం జరగకుండా తాను వారికి ఫస్ట్ ఎయిడ్ చేసి అంబులెన్స్ ద్వారా వారిని కావలి గవర్నమెంట్ హాస్పిటల్ కు తరలించి పంపిన రాష్ట్ర మహిళా కమిషన్ సభ్యురాలు గజ్జల లక్ష్మి.

Tags: Gajjala Lakshmi is a member of Women’s Commission who showed humanity

Leave A Reply

Your email address will not be published.