గాలి జనార్ధనరెడ్డి పార్టీ తుస్ కాంగ్రెస్ విజయానికి కారణం…
బళ్లారి ముచ్చట్లు:
కర్నాటక రాజకీయాల్లో ఒకప్పుడు చక్రం తిప్పిన మైనింగ్ డాన్ గాలి జనార్దన్‌రెడ్డి.. తాజా ఎన్నికల్లో ఏక్ నిరంజన్ అయ్యారు. గంగావతి నుంచి ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. అదీ కూడా తన సొంత పార్టీ కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ నుంచి 15 మంది బరిలో దిగితే.. జనార్దన్‌రెడ్డి ఒక్కరే గంగావతిలో విక్టరీ కొట్టారు. పార్టీ గుర్తు అయిన ఫుట్‌బాల్‌లో గాలి మొత్తం తీసేశారు ఓటర్లు.బీజేపీ నుంచి బయటకొచ్చి సొంతంగా పార్టీ పెట్టుకున్నారు జనార్దన్‌రెడ్డి. బళ్లారితోపాటు తనకు పట్టున్న ప్రాంతాల్లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరారు గాలి జనార్దన్‌రెడ్డి. 50 స్థానాల్లో పోటీ చేస్తామని చెప్పినా.. చివరకు 15 మంది అభ్యర్థులనే బరిలో దించారు. ఆ 15 మందిలో గాలి జనార్దన్‌రెడ్డి భార్య అరుణ లక్షి సైతం బళ్లారి సిటీ నుంచి పోటీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల వల్ల బళ్లారిలో అడుగు పెట్టడానికి వీలు లేకపోవడంతో కొప్పళ జిల్లాలోని గంగావతిని ఎంచుకున్నారు జనార్దన్‌రెడ్డి.కల్యాణ రాజ్య ప్రగతి పక్ష పార్టీ నుంచి మొత్తం 15 మంది పోటీ చేస్తే.. వారిలో గెలిచింది ఒకే ఒక్కరు గాలి జనార్దన్‌రెడ్డి. బళ్లారి సిటీలో ఆయన భార్య అరుణ లక్ష్మి కూడా ఓడిపోయారు. ఈ ఎన్నికలు గాలి కుటుంబానికి మరో షాక్ కూడా ఇచ్చాయి. బీజేపీలోనే కొనసాగి..
ఈ ఎన్నికల్లో హర్పనహళ్లి నుంచి పోటీ చేసిన గాలి కరుణాకర్‌రెడ్డి.. బీజేపీ నుంచి బళ్లారి సిటీలో బరిలో దిగిన గాలి సోమశేఖర్‌రెడ్డి సైతం ఓడిపోయారు. మొత్తానికి గాలి ఫ్యామిలీ నుంచి జనార్దన్‌రెడ్డి ఒక్కరే విక్టరీ కొట్టారు. 2 వేల 5 వందల ఓట్ల మెజారిటీ దక్కింది.గాలి జనార్దన్‌రెడ్డి బీజేపీలోనే కొనసాగి ఉంటే.. బళ్లారి ప్రాంతంలో ఫలితం ఎలా ఉండేదో ఏమో! తాజా ఎన్నికల్లో మాత్రం సొంత పార్టీ పెట్టిన మైనింగ్ డాన్.. కమలాన్ని గట్టిగానే దెబ్బతీశారని ప్రచారం జరుగుతోంది. బళ్లారి తదితర ప్రాంతాల్లో బీజేపీకి పడే ఓటు బ్యాంకు చీలిపోయింది. ఇక్కడ కాంగ్రెస్ భారీగా లాభపడింది.ఇప్పుడు ఒకే ఒక్కడిగా గాలి జనార్దన్‌రెడ్డి ఏం చేస్తారు? కాంగ్రెస్, బీజేపీలలో దేనికైనా మద్దతిస్తారా? లేక ఒంటరిగానే ఉండిపోతారా? తాను సిద్ధరామయ్యకు మద్దతిస్తానని పోలింగ్‌కు ముందు పలు సందర్భాలలో ప్రకటించారు జనార్దన్‌రెడ్డి. కాకపోతే మైనింగ్ డాన్‌పై సీబీఐ కేసులు ఉన్నాయి. ఆ కేసులను దృష్టిలో పెట్టుకుని ఇంకేదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది చూడాలి.

Tags; Gali Janardhana Reddy’s party is the reason for the victory of the Congress.332
