కొడాలి నాని కనుసన్నల్లోనే జూద క్రీడలు: చినరాజప్ప
అమరావతి ముచ్చట్లు:
గుడివాడలో టీడీపీ నేతలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గమని టీడీపీ నేత చినరాజప్ప ధ్వజమెత్తారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ గుడివాడలో మంత్రి కొడాలి నాని కనుసన్నల్లోనే జూద క్రీడలు నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఎందరో మహనీయులు పుట్టిన గుడివాడను కొడాలి నాని అక్రమ సంపాదన కోసం భ్రష్టు పట్టిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల అక్రమాలను బయట పెడితే భౌతికదాడులు చేస్తారా? అని చినరాజప్ప ప్రశ్నించారు. ఏపీలో వైసీపీ రౌడీమూకలు రెచ్చిపోతుంటే డీజీపీ ఏం చేస్తున్నారని నిలదీశారు. వైసీపీ నేతలు సంఘ విద్రోహ శక్తుల్లా మారారని చినరాజప్ప దుయ్యబట్టారు.
పుంగనూరులో రెండు లారీలు ఢీకొన్న ప్రమాదంలో డ్రైవర్లకు తీవ్ర గాయాలు
Tags; Gambling in Kodali Nani Kanusannala: Chinarajappa