ఆట సందీప్… చిరు సందేశం

హైదరాబాద్ ముచ్చట్లు:

 

ఆట ప్రోగ్రాంతో సందీప్ అనే డ్యాన్సర్ ఇండస్ట్రీలో మంచి కొరియోగ్రాఫర్‌గా ఎదిగిన సంగతి తెలిసిందే. తన శిష్యురాలైన జ్యోతిని వివాహాం చేసుకున్న సందీప్ ప్రేమ కథ కూడా సోషల్ మీడియాలో బాగానే వైరల్ అయింది. ఇక ఈ ఇద్దరూ షేర్ చేసే డ్యాన్స్ వీడియోలకు అందరూ ఫిదా అవుతుంటారు. గ్రేస్‌తో డ్యాన్స్ చేయడం సందీప్ స్పెషాలిటీ. మరీ ముఖ్యంగా మెగా ఈవెంట్లలో సందీప్ ప్రోగ్రాంలు ఇస్తుంటారు. మెగాస్టార్ చిరంజీవికి వీరాభిమాని అయిన సందీప్.. చిరు పాటలకు స్పెప్పులు వేస్తుంటారు.మెగా హీరోలతో ఉన్న అనుబంధాన్ని చెబుతూ ఆ మధ్య ఆట సందీప్ చేసిన కామెంట్లు వైరల్ అయ్యాయి. చిరు చేసే మంచిపనులపైనా నెగెటివ్ కామెంట్లు చేయడంపై సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా హీరోల్లో ప్రతీఒక్కరూ ఎంతో మందికి సాయం చేస్తుంటారు. అంతగా పరిచయం లేకపోయినా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తనకు ఎంతో సాయం చేశారని, ఇప్పటికీ ఆయన ఫోన్ చేసి ఏమైనా ఉంటే చెప్పండని సాయం చేస్తాను అని అంటారని చెప్పుకొచ్చారు.ఏంటో ఈ పిచ్చి చేష్టలు.. కూతురిపై సురేఖా వాణి కామెంట్స్తన తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్న సమయంలో కళ్యాణ్ దేవ్ దగ్గరుండి మరీ అన్నీ చూసుకున్నారని సందీప్ తెలిపారు.

 

 

 

ఇప్పటికీ తన అమ్మకు వ్యాక్సిన్ వేయడం గురించి ఆయనే ఎంక్వైరీ చేస్తుంటారని అన్నారు. అలా మెగా హీరోలు ఎంతో మందికి సాయం చేస్తారని సందీప్ అన్నారు. ఆట సందీప్ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో డ్యాన్సర్లకు అండగా నిలబడేందుకు ముందుకు వచ్చారు.టాలీవుడ్ డ్యాన్సర్లకు సాయం చేసేందుకు వారికి నిత్యావసర సరకులను అందిస్తున్నారు. ఈ కార్యక్రమానికీ కళ్యాణ్ దేవ్ సాయం అందించారట. ఇక ఆట సందీప్ మొన్న ఓ వీడియోను షేర్ చేశారు. చిరు పాటకు స్టెప్పులు వేస్తూ తన టీం అంతా కూడా పని చేశారు. ఆ వీడియో బాగానే వైరల్ అయింది. అయితే ఆట సందీప్ చేస్తోన్న సేవల గురించి తెలుసుకున్న చిరంజీవి ఓ ఆడియో మెసెజ్ పంపించారు.చిరు మాటలు విన్న ఆట సందీప్ గాల్లో తేలిపోయినట్టున్నారు. “మెగా స్టార్ చిరంజీవి”గారు నాకు వాయిస్ మెసేజ్.

 

 

 

 

మర్చిపోలేని రోజు…మాటరాని రోజు.. మెగా స్టార్ చిరంజీవి గారు నాకు వాయిస్ మెసేజ్ పంపడం..నా సంతోషానికి అవధులు లేవు. మెగా స్టార్ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వడం అసలు నాకు మాటలు రావట్లేదు. అంటూ ఎమోషనల్ అయ్యారు.‘హాయ్ సందీప్ అండ్ జ్యోతి.. చాలా సంతోషం.. మీ థ్యాంక్యూ మెసెజ్ నాకు అందింది.. ముఖ్యంగా మీ అమ్మ గారికి కూడా వేయించారు.. మీ అమ్మ అన్న మాటలు నాకు కొండంత బలాన్ని ఇస్తున్నాయి. చాలా చాలా థ్యాంక్స్. అమ్మ గారికి కూడా నమస్కారం చెప్పండి. మీరు అప్పుడప్పుడు చేస్తున్న డ్యాన్స్ బిట్స్ నా దృష్టికి వస్తున్నాయి.. మీరు జంటగా ఎంతో బాగా డ్యాన్స్ చేస్తారు. మీ గ్రేస్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. ఆల్ ది వెరీ బెస్ట్..భవిష్యత్తులో మంచి కొరియోగ్రఫర్‌గా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గుడ్ లక్.. గాడ్ బ్లెస్ యూ’ అని చిరు సందేశాన్ని షేర్ చేశారు.

 

పుంగనూరులో కరోనా రోగులకు సేవలు అందించాలి-ఎంపి రెడ్డెప్ప

 

Tags: Game Sandeep … Short message

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *