Ganapathi is the president of the Punganoor Drivers' Association

పుంగనూరు డ్రైవర్ల సంఘ అధ్యక్షుడుగా గణపతి

Date:24/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు డ్రైవర్ల సంఘ కార్యవర్గ ఎన్నికలు సోమవారం ఏకగ్రీవంగా జరిగాయి. డ్రైవర్ల సంఘ అధ్యక్షుడుగా గణపతి, కార్యదర్శిగా శంకరలను ఎన్నుకున్నారు. సంఘ సమావేశానికి ఎస్‌ఐ ఉమా మహేశ్వరరావు హాజరైయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుంగనూరులో డ్రైవర్ల సంఘం ఏర్పాటు కావడం హర్షనీయమన్నారు. అలాగే డ్రైవర్లు క్రమశిక్షణతో రోడ్డు నిబంధనలను ఉల్లంగించకుండ నడపాలన్నారు. ముఖ్యంగా మధ్యం సేవించడం , సెల్‌ఫోన్లలో మాట్లాడుతూ అతివేగంగా వెళ్లడాన్ని పూర్తిగా తగ్గించాలన్నారు. అలాగే డ్రైవర్లు తగిన లైసెన్సులు కలిగి రూ.500లు చెల్లించే వారికి రూ.2లక్షల భీమా సౌకర్యం ఉందని, వీటిని వినియోగించుకోవాలని కోరారు.ఈకార్యక్రమంలో వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

ఎంపీ నందిగం సురేష్‌పై దాడి హేయమైన చర్య

Tags: Ganapathi is the president of the Punganoor Drivers’ Association

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *