రాహుల్ తో గాంధీ గద్దర్ భేటీ

Gandhi Gaddar meet with Rahul

Gandhi Gaddar meet with Rahul

Date:12/10/2018
న్యూఢిల్లీ  ముచ్చట్లు:
తాను ఏ పార్టీలోనూ చేరనని, సెక్యులర్ పార్టీల మధ్య వారధిగా ఉంటానని గాయకుడు గద్దర్ స్పష్టం చేశారు. శుక్రవారం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో అయన భేటీ  అయ్యారు. అయన వెంట మాజీ ఎంపీ మధు యాష్కి, భార్య విమల, కుమారుడు సూర్యకిరణ్ వున్నారు. తరువాత గద్దర్ మీడియాతో మాట్లాడుతూ తనపై గతంలో జరిగిన దాడిపై విచారణ జరిపిస్తామని రాహుల్ చెప్పారన్నారు. అధికారంలోకి వస్తే రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తామన్నారని తెలిపారు. కేసీఆర్ ఇచ్చిన హామీల్లో ఒక్కటీ అమలుకాలేదని ఆయన మండిపడ్డారు. రాజకీయ పార్టీలు, ప్రజలు కోరితే గజ్వేల్ లో కేసీఆర్ పై తాను పోటీ చేస్తానని చెప్పారు. తెలంగాణలో కొత్త ఫ్యూడల్ వ్యవస్థ నడుస్తోందన్నారు. దేశాన్ని బీజేపీ ప్రభుత్వం బందీఖానాగా మార్చిందని గద్దర్ ఆరోపించారు.
Tags:Gandhi Gaddar meet with Rahul

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *