Natyam ad

రేపు “గాంధీ” సేవా పురస్కారాలు ..

అక్టోబర్ రెండో తేదీ ఆదివారం  సాయంత్రం 6 గంటలకు
తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో ..

అమరావతి ముచ్చట్లు:


మహాత్మా గాంధీ జయంతిని  పురస్కరించుకుని రేపు  అక్టోబర్ రెండో తేదీ ఆదివారం  సాయంత్రం 6 గంటలకు  తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ హాల్ లో  “మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారాలు” అందిస్తున్నారు. సామాజిక సేవ, విద్య, వైద్య వ్యాపార, సినీ, కళా రంగాలలో నిష్ణాతులైన పలువురు ప్రముఖులకు ఈ పురస్కారాలను గిఫ్ట్ ఫౌండేషన్, ఈఫిల్ లైఫ్ సొసైటీ సంస్థలు సంయుక్తంగా అందిస్తున్నాయి. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరవుతున్న ఈ సభకు అందరూ ఆహ్వానితులే అని నిర్వాహకుల తరపున “గిఫ్ట్ ఫౌండేషన్” కో ఫౌండర్ సినీ నిర్మాత  ఆర్ కృష్ణవేణి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీయుతులు కొండా విజయ్ కుమార్, ఏ గురు రాజ్, జేవి మోహన్ గౌడ్, పి.విజయ వర్మ, కూనిరెడ్డి శ్రీనివాస్, టి.రామ సత్యనారాయణ, కే ఉదయ్ కిరణ్, కాదంబరి కిరణ్, శ్రీ వికాస్,ఆర్ స్వామి నాయుడు, కుంచె రమణారావు, చిత్తరంజన్ దాస్,నల్లమోతు శ్రీధర్,విజయ సాయి కుమార్, డాక్టర్ రవికాంత్ అత్తులూరు, డాక్టర్ మహమ్మద్ రఫీ,డాక్టర్ సుధా జైన్, ప్రవీణ తోట,  వీవీ రిషిక,  అనుప్రసాద్,  అరుణ సుబ్బారావు,  లతా చౌదరి,  కోమలాదేవి ఈ  మహాత్మా గాంధీ ప్రశంసా పురస్కారాలు అందుకుంటున్న వారిలో ఉన్నారు.

 

Post Midle

Tags: Gandhi” service awards tomorrow..

Post Midle