Natyam ad

గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సీఎం జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యపడింది

– సర్పంచ్ శ్రీనివాసులురెడ్డి

రామసముద్రం ముచ్చట్లు:

Post Midle

జాతిపిత మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యపడిందని కెసిపల్లి సర్పంచ్ దిగువపల్లి శ్రీనివాసులురెడ్డి అన్నారు. ఆదివారం
153వ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా స్థానిక సచివాలయంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశానికి అహింసామార్గంలో స్వాతంత్య్రం సముపార్జించిపెట్టిన సత్యాగ్రహ సేనాని మన జాతిపిత మహాత్మాగాంధీ అన్నారు. ఆయన తన జీవితాన్నే ప్రయోగశాలగా మార్చుకుని సత్యశోధన చేసిన మహా జ్ఞాని, బాపూజీగా భారతీయుల అభిమానం చూరగొన్న మహనీయుడన్నారు. గాంధీ జీవితం యావత్‌ ప్రపంచానికి ఆదర్శనీయం…ఆచరణీయని… ఆయన ఆశయ సాధనకు మనందరం కృషిచేయాలన్నారు. అందుకే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గాంధీజీ కలలుగన్న స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థకి శ్రీకారం చుట్టారని, ఆయన గొప్పతనాన్ని కొనియాడారు.

 

గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం నేడు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డితోనే సాద్యమైనదని, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి సచివాలయ వ్యవస్థతో ఎంతో అభివృద్ధి చేయడం జరుగుతుందని, రైతుల అభ్యున్నతికి సహితం కృషిచేసి మహాత్ముని అడుగుజాడల్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని ఆయన వివరించారు. అనంతరం సచివాలయం ఆవరణంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ గ్రామసభను నిర్వహించి 2023-24 సంవత్సరానికి ప్రజలకు అవసరమైన పనుల ప్రణాలికను రూపొందించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గోవర్ధన్ రెడ్డి, ఇంజనీరింగ్ అసిస్టెంట్ మూర్తి, వెల్పేర్ అసిస్టెంట్ ఉపేంద్ర, ఫీల్డ్ అసిస్టెంట్ వెంకటరమణ, స్థానిక నేతలు బాబు, ఎల్లారెడ్డి, మునస్వామి, జయచంద్ర, నాగరాజ, శివశంకర్, మోహన్, వాలింటర్లు రేవతి, రెడ్డెమ్మ, శ్రావణి, పుష్పావతి, దినకర్, హరీష్, హరితరాయబారులు రెడ్డెప్ప, ఆంజప్ప, శంకరప్ప తదితర ప్రజలు పాల్గొన్నారు.

Tags: Gandhi’s dream of village swaraj was possible only with CM Jaganmohan Reddy

Post Midle