Natyam ad

ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి గండి

ఒంగోలు ముచ్చట్లు:


రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భ‌ర్తీకి గండి కొట్టేందుకు ఏపీ సర్కార్ హేతుబద్ధీకరణకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా జిల్లా యూనిట్‌గా తీసుకుని ఉపాధ్యాయులను ఉన్న‌చోట‌నే స‌ర్దుబాటు చేసే అవకాశం ఉంది.  అస‌లు మొత్తం ఉపాధ్యాయుల పోస్టుల ఖాళీల‌ను భ‌ర్తీ చేయ‌డానికి అనేక సాంకేతిక ఇబ్బందులున్నాయని చెబుతోంది.   కొన్నిచోట్ల ఎక్కువ‌మంది విద్యార్ధులు, మ‌రికొన్ని చోట్ల ఎక్కువ‌మంది ఉపాధ్యాయులు ఉండ‌డం వంటి కారణాల వల్ల బోధన   అన్ని ప్రాంతాల్లోనూ   స‌మానంగా జ‌ర‌గ‌డం లేదని చెబుతోంది. ఈ కారణం చెబుతూ ఖాళీల భర్తీ జోలికి వెళ్లకుండా  ఉపాధ్యాయుల హేతుబద్ధీకరణ  నిర్వహించాలని ప్రభుత్వం గత కొంత కాలంగా ప్రయత్నిస్తోంది. కరోనా వ‌ల్ల‌ గత రెండేళ్లుగా పాఠశాలలు సరిగ్గా నడవకపోవడంతో ఈ విషయాన్ని పక్కన పెట్టారు.  అయితే హేతుబద్ధీకరణ కు సంబంధించి అధికారులు ఇప్పటికే పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించి సిద్ధంగా ఉంచారు. అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏయే పాఠ శాలల్లో ఎంత మంది విద్యార్థులున్నారు? విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఎంత మంది ఉపాధ్యాయులను హేతుబద్ధీకరించాల్సి ఉం టుంది?  అన్న విషయంపై  నివేదికను సిద్ధం చేశారు.ఉపాధ్యాయుల సీనియారిటీ ప్రకారం రేషనలైజేషన్‌లో స్థాన చలనం ఉంటుంది.

 

 

ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు   రెగ్యులర్‌గా నడుస్తుండడంతోపాటు ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలను భర్తీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే   ఖాళీలు భర్తీ చేయాలంటే ముందుగా హేతుబద్ధీకరణ జరగాలని ప్రభుత్వం చెబుతోంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చేసి నట్టు తెలిసింది. ఈ ఆదేశాలకు అనుగుణంగా త్వరలోనే రేషనలైజేషన్‌ షెడ్యూల్‌ను విడుదల చేసే అవకాశం ఉంది.ఆయా జిల్లాల పరిధిలోనే ఈ షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు.  అయితే రేషనలైజేషన్‌లో భాగంగా ఎక్కువ మంది టీచర్లకు స్థాన చలనం అనివార్యమౌతుందని చెబుతున్నారు.  మరోవైపు పాఠశాలల్లో విద్యార్థులకు సంబంధించిన ప్రగతిని నెల వారీగా నమోదు చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు డీఈవోలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ ప్రగతి నివేదికలను ఆన్‌లైన్‌లో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ నివే దికల్లో ఒకవేళ విద్యార్థుల ప్రగతి తగ్గినట్టుగా స్పష్టమైతే.. సంబంధిత పాఠశాల టీచర్లు సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

 

Post Midle

Tags: Gandi for the replacement of teacher posts

Post Midle