Natyam ad

ఒకే రోజు గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి

హైదరాబాద్ ముచ్చట్లు:

హైదరాబాద్ లో జరిగే రెండు ప్రతిష్టాత్మక పండుగలు
ఈ నేపథ్యంలో అప్రమత్తమైన హైదరాబాద్ పోలీసులు
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరకుండా ఏర్పాట్లు
రెండు మతాల పెద్దలతో 300 మంది సభ్యులతో పీస్ కమిటీ ఏర్పాటు..
మిలాద్ ఉన్ నబి వాయిదాకు పీస్ కమిటీ ఒకే..

Post Midle

గణేష్ ఉత్సవాలు,   మిలాద్ ఉన్నబి నేపథ్యంలో సెంట్రల్ జోన్ డిసిపి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో 300 మంది పీస్ కమిటీ సభ్యులు పాల్గోన్నారు. సెప్టెంబర్ 28 వ తేదీన గణేష్ నిమజ్జనం, మిలాద్ ఉన్ నబి పండుగలు ఒకే రోజు రావడంతో.. పీస్ కమిటీ కి మిలాద్ ఉన్నబి వాయిదా వేసేందుకు ఒప్పుకున్నారు. భక్తులు 3, 6, 9 రోజుల్లో ఎప్పుడైనా గణేష్ విగ్రహ నిమజ్జనం చేసుకోవాలని సూచించారు. డీసీపీ మాట్లాడుతూ గణేష్ ఉత్సవాల నేపథ్యంలో పోలీసు బందోబస్తు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నాం. రెండు పండుగలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఏర్పాటు చేస్తున్నామని అన్నారు.

 

Tags: Ganesh immersion and Milad un Nabi on the same day

Post Midle