Natyam ad

యమ్ యల్ సీ ఇసాక్ బాష ను కలసిన గణేష్ మహోత్సవ కమిటీ

నంద్యాల ముచ్చట్లు:

నంద్యాల జిల్లా కేంద్రంలో బుధవారం నాడు  శ్రీ గణేష్ మహోత్సవ కేంద్ర సమితి అధ్యక్షులు  గంగిశెట్టి విజయ్ కుమార్  మరియు కమిటీ సభ్యులు  శాసన మండలి సభ్యులు ఇసాక్ భాషా ని సెప్టెంబర్ 4న జరగబోవు సామూహిక వినాయక నిమజ్జోత్సవ కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. మరియు అధికారులను సమన్వయపరిచి ఉత్సవాలు సజావుగా జరగడానికి సహకరించాలని కోరడం జరిగింది. యమ్ యల్ సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ కరోనా తరువాత జరుపుకుంటున్న అతిపెద్ద కార్యక్రమమైనటువంటి వినాయక నిమజ్జోత్సవ కార్యక్రమాల్లో స్వయంగా పాల్గొంటానని ప్రజలు ఉత్సాహంగా నిర్వహించుకోవాలని అందుకు అన్ని శాఖల అధికారులను సమన్వయ పరుస్తానని అందరికీ శుభాకాంక్షలు తెలిపారు .ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు యమ్ జీ వి. రవీంద్రనాథ్, డమాం శంకర్, పడగండ్ల సుబ్రమణ్యం, ధనేస్వర రెడ్డి, మేఘశ్యామ్, సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

 

Tags: Ganesh Mahotsava Committee met Yam Yal Si Isak Basha

Post Midle
Post Midle

Leave A Reply

Your email address will not be published.