ఆకర్షిస్తున్న వృక్ష వినాయకుడు

సింహచలం ముచ్చట్లు:

విశాఖలో సింహాచలం పాత గోశాల వద్ద ప్రకృతి సిద్ధంగా తయారైన వినాయకుడు మహిళలను ఆకర్షిస్తున్నాడు. ఆ ప్రకృతి వినాయకుడికి అక్కడి మహిళలు పూజలు చేస్తున్నారు. సింహాచలం పాత గోశాల వద్ద చెట్టుపైకి తీగలతో మొక్క వ్యాపించింది. ఈ తీగ మొక్క వినాయకుడి ఆకారంలో కనిపిస్తోంది. దీంతో స్థానిక మహిళలు దానిని విఘ్నేశ్వరుడి మహిమగా భావించి పూజలు చేస్తున్నారు.వినాయకుడి ఆకారంలో ఉన్న చెట్టు దూరంగా ఉన్నప్పటికీ … మహిళలు పూజలు చేస్తున్నారు.ఈ ప్రకృతి వినాయకుడిని తామొక సందేశంగా భావిస్తున్నారు స్థానిక మహిళలు.రాబోయే వినాయక చవితికి ప్రతి ఒక్కరూ ప్లాసర్ ఆఫ్ పారిస్ ప్రతిమలు కాకుండా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని కోరుతున్నారు.ఇదే సందేశాన్ని ప్రకృతి సిద్ధంగా చెట్టుపై వెలసిన వినాయకుడు తమకు ఇస్తున్నాడని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ విషయం స్థానికులకు తెలియడంతో వినాయకుడిని చూసేందుకు భారీగా అక్కడికి తరలివస్తున్నారు.

 

Tags: Ganesha is an attractive plant

Leave A Reply

Your email address will not be published.