అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
గుంటూరు ముచ్చట్లు:
గుంటూరు పోలీసులు అంతర్ రాష్ట్ర దొంగల ముఠా ను అరెస్టు చేసారు. కేసు వివరాలు జిల్లా ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ మీడియాకు వెల్లడించారు. గుంటూరు టౌన్లో వరుస దొంగ తనాలతో దొంగల ముఠా బెంబేలెత్తించింది. ఉత్తర ప్రదేశ్ నుంచి గుంటూరు వచ్చి దొంగతనాలకు పాల్పడ్డారు. పగలు దుప్పట్లు అమ్ముతున్నట్లు నటిస్తూ తాళాలు వేసీన ఇళ్ళను టార్గెట్ చేశారు. గ్యాంగులో ముగ్గురును అదుపులో తీసుకున్నాం. తెలంగాణాలో వీరిపై పలు కేసులు ఉన్నాయి. గుంటూరు టౌన్లో వీరిపై ఎనిమిది కేసులున్నాయి. అన్ని కేసులు తాళాలు వేసిన ఇంటిని టార్గె్ట్ చేసినవే.. నిందితులనుంచి నుంచి రూ.7.8 లక్షల విలువైన చోరీ సొత్తును, రూ.1.2 లక్షల నగదు.స్వాదీనం చేసుకున్నామని అన్నారు.
Tags: Gang of inter-state robbers arrested

