దొంగల ముఠా అరెస్టు

మంచిర్యాల  ముచ్చట్లు:
మంచిర్యాల జిల్లలో ద్విచక్ర వాహనాలను దొంగలిస్తున్నముఠా సభ్యులను మంచిర్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 10 లక్షల విలువ చేసే ఒక లారీ తో పాటు 7 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోని వారిని రిమాండ్కు తరలించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంచిర్యాల ప్రాంతానికి చెందినా పాత నేరస్తులు అయిన మహమద్ మహబూబ్, రవి, మరో బాల నేరస్తుడు ముగ్గురు కలిసి మెకానిక్ పని చేస్తూ వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో వీరంతా ఓ ముఠాగా ఏర్పడి ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటిని విక్రయించి వచ్చే నగదును సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. ఒక లారీతో పాటు 6 లారీ టైర్లు దొంగిలించారని తెలిపారు, వీరందరినీ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి పట్టుకున్నామని తెలిపారు. మరో కేసులో మహారాష్ట కు చెందినా ఒక పిక్ పకేటర్ ను కుడా అరెస్ట్ చేశామని అన్నారు, విరి వద్ద నుండి ఒక లారీ, 6 లారీ టైర్లు, రెండు సెల్ ఫోన్స్ స్వాదినం చేసుకున్నామని తెలిపారు, ప్రజలందరూ వాహన దొంగల పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రతి ఒక్కరు విధిగా తమ వాహనాలను సురక్షిత ప్రాంతాల్లో ఉంచే విదంగా, ఇంటి పరిసరాల్లో సిసి కామేరాస్ ఏర్పాటు చేసే విదంగా చూడాలని కోరారు. అనంతరం ఈ ముఠా సభ్యులను అరెస్ట్ చేయడంలో ప్రతిబ కనబరచిన పోలీసులకు రివార్డ్తో పాటు వారిని అభినందించారు, ఈ కార్యక్రమంలో స్థానిక పోలిస్ సిబ్బంది పాల్గొన్నారు.

 

పుంగనూరు ఎస్‌ఈబి సీఐగా సీతారామిరెడ్డి

Tags:Gang of thieves arrested

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *