గంగాదేవిపల్లెలో జేసీపర్యటన

Ganga Devi in Ganga Devi

Ganga Devi in Ganga Devi

Date:26/02/2018
అనంతపురం ముచ్చట్లు:
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు  చేపట్టిన దళిత తేజం కార్యక్రమంలో భాగంగా సోమవారం నాడు ఎమ్మెల్యే జీసీ  C.ప్రభాకర్ రెడ్డి  తాడిపత్రి మండలంలోని గంగాదేవిపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో విస్తృతంగా పర్యటించారు.కాలనీలో వసతి సౌకర్యాలను పరిశీలించి, అక్కడ నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీల అభివృద్ధికి వివిధ రకాల పథకాలను ప్రవేశపెట్టి వాటిని సమర్థవంతంగా అమలు చేస్తోందన్నారు.ఎస్సీల  శ్రేయస్సు కోసం పాటుపడుతున్న ఘనత ఒక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే దక్కుతుందన్నారు.ఈ దళిత తేజం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే  పాటు యువనేత జేసీ .అష్మిత్ రెడ్డి గారు కూడా ఎస్సీ కాలనీలో పర్యటించారు.ఈ కార్యక్రమంలో టీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు ఎస్వీ రవీంద్రారెడ్డి, గ్రామ సర్పంచ్ రామకృష్ణ, నాయకులు జయరామిరెడ్డి, రామంజులరెడ్డి, తిరునాథరెడ్డి, చిన్నా తదితరులు పాల్గొన్నారు.
Tags; Ganga Devi in Ganga Devi

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *