Natyam ad

పుంగనూరులో గంగజాతరను పటిష్టంగా నిర్వహిస్తాం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణ జమీందారుల ఆరాధ్య కులదైవమైన శ్రీసుగుటూరు గంగమ్మ జాతరను ఏప్రిల్‌ 2, 3 తేదీలలో వైభవంగా నిర్వహిస్తామని మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా తెలిపారు. శనివారం సాయంత్రం జమీందారులు సోమశేఖర చిక్కరాయుల్‌, మల్లికార్జున రాయల్‌తో చైర్మన్‌ సమావేశమై ఏర్పాట్లు పరిశీలించారు. పారిశుద్ధ్యం , మంచినీరు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తామన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండ జాతరను ప్రతి ఒక్కరు జయప్రదం చేయాలని కోరారు. అలాగే పిడిఎఫ్‌ అధ్యక్షుడు బానుప్రకాష్‌ ఆధ్వర్యంలో జాతర టీషర్టులను జమీందారులు విడుదల చేశారు. ఈ సమావేశంలో సీమ జిల్లాల మైనార్టీ సెల్‌ ఇన్‌చార్జ్ ఫకృద్ధిన్‌షరీఫ్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు జయరాం, మాజీ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, కౌన్సిలర్లు త్యాగరాజు, నరసింహులు , జిల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్‌ అమ్ము, పార్టీ నాయకులు కిషోర్‌, మునిరాజ, అఫ్సర్‌, జావీద్‌, నాని తదితరులు పాల్గొన్నారు.

Post Midle

Tags: Ganga Jatara will be organized strongly in Punganur

Post Midle