ఆషాడమాసంలో గంగమ్మ ఆలయానికి రూ:1.49 కోట్లు ఆదాయం
— ఊహించని రీతిలో తొలిసారిగా ఆదాయంరెట్టింపు
— మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డిలచే సహకారంతో ఆదర్శంగా బోయకొండ
— సిబ్బందికి అభినందనలు తెలిపిన చైర్మన్ శంకర్నారాయణ
చౌడేపల్లె ముచ్చట్లు:
పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ ఆలయానికి అమ్మవారికి ప్రీతిపాత్రమైన ఆషాడమాసం నెలలో ఆలయానికి రూ:1.49 కోట్లు ఆదాయం సమకూరిందని ఆలయ కమిటీ చైర్మన్ మిద్దింటి శంకర్నారాయణ తెలిపారు. సోమవారం బోయకొండలో హుండీ లెక్కింపు నిర్వహణ అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రమౌళి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్ లతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సంధర్భంగా చైర్మన్ మాట్లాడుతూ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , ఎంపీ మిథున్రెడ్డిల ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి పర్యవేక్షణలో బోయకొండలో కోట్లాది రూపాయల నిధులతో అభివృద్దిపనులు చురుగ్గా సాగుతున్నాయన్నారు. దిన దినాభివృద్ది చెందుతూ బోయకొండ సరికొత్తదనంతోపాటు ఆహ్లాదకరమైన వాతావరణంను తలపించేలా ముస్తాబైందన్నారు. బోయకొండకు వచ్చే యాత్రికులకు అవసరమైన సదుపాయాలు, రవాణా మార్గం కల్పించడంతో భక్తులు ఈయేడాది అధిక సంఖ్యలో దర్శనం కోసం తరలివచ్చారు. 35 రోజుల కాలంలో హుండీ కానుకల ద్వారా రూ:68,07,024 రూపాయలు, బంగారం 69 గ్రాములు, వెండి 348 గ్రాములు సమకూరిందన్నారు. వీటితోపాటు అమ్మవారి ఆలయంలో విక్రయించిన వివిధ సేవా టికెట్ల ద్వారా రూ:79,44,702 రూపాయలు సమకూరిందన్నారు. గతంలో ఎన్నడూ ఊహించని రీతిలో ఆదాయం సమకూరి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆలయ ఆదాయం కు కృషిచేసి విధులు నిర్వహించిన సిబ్బందిని చైర్మన్, ఈఓ అభినందించారు.ఈ కార్యక్రమంలో టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేంద్ర,పాలకమండళి సభ్యురాలు శ్రావణి, మాజీ మెంబరు రాయల మోహన్ తదితరులున్నారు.
Tags: Gangamma temple earns Rs: 1.49 crores in Ashadamasam