గంగవరం పాఠశాల ను విలీనం నుండి మినహాయించాలి

గంగవరం ముచ్చట్లు:

 

-నల్లపల్లి విజయ్ భాస్కర్ రాష్ట్ర అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్.అనంతపురం జిల్లా, బెళుగుప్ప మండలం, గంగవరం ప్రాథమిక పాఠశాలను విలీనం నుండి శాశ్వతంగా మినహాయించాలని ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు నల్లపల్లి విజయ్ భాస్కర్ డిమాండ్ చేశారు. ఈ సందర్బంగా ఆయన విలీనం అయిన గంగవరం పాఠశాలను సందర్శించి విద్యార్థులు, తల్లి తండ్రులతో మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ జీవో 117 మేరకు గతం లో గంగవరం ప్రాథమిక పాఠశాలలోని 3,4,5 తరగతులను స్థానిక ఉన్నత పాఠశాల లో విలీనం చేసారని కానీ ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభం నుండి 3,4,5 తరగతుల లో చదివే 50 మంది విద్యార్థులను తల్లి తండ్రులు ఉన్నతపాఠశాలకు పంపడం లేదని అన్నారు.విద్యా సంవత్సరం ప్రారంభం నుండే తల్లి తండ్రులు పోరాటం చేస్తుంటే అధికారులు ఆలసత్వం ప్రదర్శించడం సరైనది కాదని విమర్శించారు. 60 మంది విద్యార్థులు ఉన్నచోట కేవలం 2 టీచర్ల తో విద్యా బోధన ఎలా సాధ్యం అని ప్రశ్నించారు. ప్రాథమిక పాఠశాలకు, ఉన్నత పాఠశాలకు వెళ్లే మార్గ మద్యం లో వంక, స్మశానం ఉన్నా కూడా అప్పటి అధికారులు రాజకీయ ఒత్తిడికి గురికావడం వల్ల గంగవరం పాఠశాల విలీనం నుండి మినహాయింపబడలేదని అన్నారు. 3,4,5 తరగతుల విద్యార్థులు ఉన్నతపాఠశాలకు వెళ్లకుండా ప్రాథమిక పాఠశాల లోనే అనధికారికంగా కొనసాగడం వల్ల మధ్యాహ్న భోజనం, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, విద్యార్థుల హాజరు, యాప్స్ నిర్వహణ లో సమస్యలు ఏర్పడడం వల్ల ఉపాధ్యాయులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. 2021 సంవత్సరం లో 202 మంది విద్యార్థులు, 6 మంది టీచర్లతో ఉన్న గంగవరం పాఠశాల విలీనం తర్వాత 18 మంది విద్యార్థులు, 2 టీచర్లు ఉన్నారంటే 117 జీవో వల్ల ప్రాథమిక విద్య కు ఎంతటి నష్టం జరిగిందో మేధావి వర్గం అర్థం చేసుకోవాలని అన్నారు. 117 జీవో వల్ల ఇలాంటి ఎన్నో పాఠశాలకు నష్టం వాటిల్లిందని అన్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి గంగవరం ప్రాథమిక పాఠశాల ను విలీనం నుండి శాశ్వతంగా మినహాయించాలని డిమాండ్ చేశారు.

 

 

Tags:Gangavaram school should be excluded from merger

By TM-Team

Related Post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *