పుంగనూరు సీఐగా గంగిరెడ్డి

Gangi Reddy as PUNGANURU SEI
Date:18/07/2019
పుంగనూరు ముచ్చట్లు:
పుంగనూరు అర్భన్ సర్కిల్ ఇన్స్పెక్టర్గా ఎం.గంగిరెడ్డి గురువారం పదవి బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ పని చేస్తున్న నాగశేఖర్ను వీఆర్‌కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో సీఐడిలో సీఐగా ఉన్న గంగిరెడ్డి ఇక్కడికి వచ్చారు. కాగా గంగిరెడ్డి మాజీ ఎంపీ స్వర్గీయ వివేకానందరెడ్డి సిట్ దర్యాప్తుబృందంలో ఉన్నారు. ఈ సందర్భంగా నూతన సీఐను ఎస్ఐ అరుణ్‌కుమార్‌రెడ్డి, సిబ్బంది కలసి శుభాకాంక్షలు తెలిపారు. విలేకరులతో సీఐ గంగిరెడ్డి మాట్లాడుతూ పట్టణంలో ట్రాఫిక్ సమస్యను క్రమబద్దీకరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండ చూస్తామన్నారు. ప్రజలకు సేవలు అందించేందుకు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటామని , ఏ సమాచారాన్ని అయిన నిర్భయంగా అందించాలని కోరారు.
నీటి చౌర్యానికి పాల్పడితే కఠిన చర్యలు
Tags: Gangi Reddy as PUNGANURU SEI