విశాఖలో చెడ్డీ గ్యాంగ్ దొంగల ముఠా..

Gangster gang of pirates in Visakhapatnam

Gangster gang of pirates in Visakhapatnam

Date:09/10/2018
విశాఖపట్టణం  ముచ్చట్లు:
చెడ్డీ గ్యాంగ్.. తెలుగు రాష్ట్రాలను హడలెత్తించిన దొంగల ముఠా.. ముఖ్యంగా హైదరాబాదీలకు కంటి మీద కునుకు లేకుండా చేసిన గ్యాంగ్. ఈ మధ్యే చెడ్డీ గ్యాంగ్‌లోని కొందరు సభ్యుల్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ కూడా చేశారు. ఆ తర్వాత ఈ గ్యాంగ్ జాడ ఎక్కడా కనిపించలేదు.. అయితే తాజాగా ఈ చెడ్డీ బ్యాచ్ విశాఖలో ప్రత్యక్షమయ్యింది. నగరం శివారులోని ఓ విల్లాలో దోపిడీకి చేసేందుకు ప్రయత్నించింది. మధురవాడ సమీపంలోని పోతిన మల్లయ్యపాలెంలో పనోరమా హిల్స్‌లో ఉన్న 66 నెంబర్ విల్లాలోకి ఈ చెడ్డీ గ్యాంగ్ అర్థరాత్రి తర్వాత చొరబడింది.
చోరీ చేసేందుకు ప్రయత్నించినా కుదరకపోవంతో అక్కడి నుంచి ఎవరి కంటిలో పడకుండా జారుకుంది. ఈ గ్యాంగ్ విల్లాలోకి చొరబడే దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. నలుగురు చెడ్డీలు, బనియన్లతో లోపలికి వెళ్లడం.. గోడలు దూకడం క్లియర్‌గా ఫుటేజ్‌లో కనిపించింది. సీసీ కెమెరా ఫుటేజ్ చూసి షాకైన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు చోరీ ప్రయత్నం జరిగిన విల్లా, సీసీ ఫుటేజ్‌ను పరిశీలించారు. దీని ఆధారంగా దొంగల్ని పట్టుకునే పనిలో ఉన్నారు. చోరీ యత్నం జరిగిన విల్లా యజమాని హైదరాబాద్‌లో ఉంటారని తెలుస్తోంది. నగరానికి అప్పుడప్పుడూ వచ్చి వెళుతుంటారని స్థానికులు చెబుతున్నారు. చెడ్డీ గ్యాంగ్ హల్చల్ చేయడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. రాత్రిళ్లు పోలీస్ పెట్రోలింగ్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Tags:Gangster gang of pirates in Visakhapatnam

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *