బాబ్లీ కేసులో ధర్మాబాద్ కోర్టుకు హాజరైన  గంగుల కమలాకర్  బెయిలు మంజూరు

Gangula Kamalakar, who attended court in Dharmabad in the case of Babli

Gangula Kamalakar, who attended court in Dharmabad in the case of Babli

Date:21/09/2018
వచ్చే నెల 15 కు కోర్టుకు హాజరు కావాల్సింది గా కోర్టు ఆదేశం
ధర్మాబాద్ ముచ్చట్లు:
మహారాష్ట్రలోని వివాదాస్పద ప్రాజెక్టు బాబ్లీ ప్రాజెక్టుకు  వ్యతిరేకంగా  ధర్నా చేసేందుకు వెళ్లిన వారిలో చంద్రబాబుతో పాటు  గంగుల కమలాకర్  మరో 14 మంది కి ధర్మాబాద్ కోర్టు  నోటీసులు జారీ చేసింది . ఈనెల  21న మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్టుకు  హాజరుకావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు .. బాబ్లీ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే ఉత్తర తెలంగాణ ఎడారి అవుతుందనే ఉద్దేశంతో ఆనాడు ఆందోళనకు దిగిన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తో పాటు  గంగుల కమలాకర్  తో సహా అప్పటి టిడిపి నేతలపై మహారాష్ట్రలోని ధర్మాబాద్ కోర్ట్ నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
దీంతో కోర్టుకు హాజరయ్యేందుకు గంగుల కమలాకర్ తోపాటు ప్రకాష్ గౌడ్ రత్నం హాజరయ్యారు. గోదావరి నదిపై శ్రీరాం సాగర్ ప్రాజెక్టు ఎగువన మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ గ్రామం వద్ద 2005లో బాబ్లి ప్రాజెక్టు నిర్మాణం తలపెట్టింది. బాబ్లీతో పాటు 14 చిన్న, మధ్య తరహా ప్రాజెక్టులను మహారాష్ట్ర సర్కారు నిర్మాణం చేపట్టింది. వీటిపై ఓ వైపు న్యాయస్థానంలో కొనసాగుతుండగానే మరోవైపు రాజకీయంగా తీవ్ర వివాదాస్పదమైంది. దీంతో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా 2010 జూలై 16న బాబ్లీ సందర్శనకు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు వెళ్లారు.
అయితే బాబ్లీ పరిసరాల్లో మహారాష్ట్ర ప్రభుత్వం 144 సెక్షన్ విధించండంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి..   ఈ క్రమంలో మహారాష్ట్ర పోలీసులు చంద్రబాబు సహా నేతలందరినీ అరెస్టు చేసి ధర్మాబాద్ ఐటీఐకి తరలించారు. అక్కడ కనీస సౌకర్యాలు కూడా కల్పించలేదు. దీంతో అప్పట్లో సరిహద్దు వరకు తరలివచ్చిన టిడిపి కార్యకర్తలపై లాఠీ చార్జీ చేశారు.
ఈ లాఠీచార్జిలో  గంగుల కమలాకర్ గారికి  తీవ్ర గాయాలు అయినవి . ఉమ్మడి ఏపీ రాష్ట్ర భూభాగంలోకి చొరబడి ప్రజలను చితకబాదిన ఘటన పెద్ద సంచనలంగా మారింది. అయితే నేతలపై కేసులేమి పెట్టలేదని చెప్పి ప్రత్యేక విమానంలో టీడీపీ నేతలను  హైదరాబాద్ కు తరలించారు. గంగుల వెంట టిఆర్ఎస్ నాయకులు నందేల్లి మహిపాల్ , అంజద్ , ప్రేమ్ కుమార్ ముందడా , రాజేందర్ రావు ,అడ్వకేట్ అనిల్ కుమార్ ఉన్నారు.
Tags:Ganguly Kamalakar Bail granted to court in Dharmabad court case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *