గంజాయి ముఠా అరెస్టు
గూడూరు ముచ్చట్లు:
తిరుపతి జిల్లా గూడూరు పట్టణ పరిధిలోని మినీ బైపాస్ చెన్నై కలకత్తా జాతీయ రహదారి కూడలి సమీపంలో ముగ్గురు వ్యక్తులను అదుపులో తీసుకొని వారి వద్ద నుండి 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఈబీ డిఎస్పి జానకిరామ్ తెలిపారు .గూడూరు రెండో పట్టణ పరిధిలోని ఎస్ఈబీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు
ఎస్ఈబీ అధికారులు అరెస్టు చేసిన నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న గంజాయిని ప్రదర్శించారు ఈ సందర్భంగా డిఎస్పి జానకిరామ్ మాట్లాడుతూ పక్క సమాచారంతో గూడూరు ఎస్సీబీ సీఐ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణ పరిధిలోని మినీ బైపాస్ జాతీయ రహదారి కూడలి సమీపంలో గంజాయి ప్యాకెట్లను కలిగి ఉన్న పాత ముద్దాయిలు అయిన నెల్లూరు నగరానికి చెందిన వెంకటేశ్వర్లు స్వర్ణలత ఉష అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుండి 26 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమంలో సిఐ విజయకుమార్ , ఎస్ఐ అంకమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Tags: Ganja gang arrested

