తిరుమలలో గరువ పంచమి
తిరుమల ముచ్చట్లు:
కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయంలో గరుడ పంచమిని ఘనంగా నిర్వహించారు. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని గరుడసేవను వైభవంగా నిర్వహించింది తిరుమల తిరుపతి దేవస్థానం. రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామి వారు ధగాధగా మెరిసిపోతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు.గోవింద నామ స్మరణలతో మారుమోగాయి. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.గోవింద నామ స్మరణలతో మారుమోగాయి. పౌరాణిక నేపథ్యంలో 108 వైష్ణవ దివ్యదేశాలలోనూ గరుడసేవ అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియచేశారు. అంతేకాదు జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ గరుడ సేవను తిలకించేందుకు భక్తులు భారీగా పోటీ పడతారు.గరుడ వాహనం ద్వారా స్వామి వారు దాసానుదాస ప్రపత్తికి తాను దాసుడని తెలియచేశారు. అంతేకాదు జ్ఞానవైరాగ్య ప్రాప్తికోరే మానవులు జ్ఞానవైరాగ్య రూపాలైన రెక్కలతో విహరించే గరుడుని దర్శిస్తే సర్వపాపాలు తొలగుతాయని భక్తులు నమ్ముతారు. అందుకే ఈ గరుడ సేవను తిలకించేందుకు భక్తులు భారీగా పోటీ పడతారు.

Tags: Garuva Panchami in Tirumala
