Natyam ad

గ్యాస్ సిలిండర్ 500 కేమహిళలకు ఉచిత బస్సు ప్రయాణం

రాహుల్ గాంధీ

భూపాలపల్లి ముచ్చట్లు:


ఈ ఎన్నికలు దొరల తెలంగాణ కు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. గురువారం నాడు అంబటిపల్లిలో జరిగిన మహిళా సదస్సులో అయన మాట్లాడారు.
లక్ష కోట్ల తెలంగాణ సంపద దోపిడీకి గురైంది. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కు, ఆయన కుటుంబానికి ఏటీఎంగా మారింది. రాష్ట్ర సంపదను దోచుకుని తెలంగాణలో ప్రతీ కుటుంబంపై అప్పు భారాన్ని మోపారు. కేసీఆర్ దోచుకున్న సొమ్మును తిరిగి ప్రజలకు చెందేలా చూస్తామని అన్నారు.
అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2500 అందించనున్నాం. మోదీ, కేసీఆర్ పాలనలో సిలిండర్ ధర రూ.12 వందలకు చేరిందని అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.500లకే గ్యాస్ సిలిండర్ అందిస్తాం. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. ఎన్నికల్లో బీజేపీ, బీఆరెస్, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి. అందుకే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని అయన అన్నారు.

 

Post Midle

Tags: Gas cylinder 500 free bus travel for women

Post Midle