Natyam ad

గ్యాస్ సిలిండర్ పేలుడు..ఒకరి మృతి

సికింద్రాబాద్ ముచ్చట్లు:


మెట్టుగూడ డివిజన్  దూద్ బావి లో ఒక   ఇంట్లో  గ్యాస్ సిలిండర్ పేలిపోయింది. ఘటనలో తొమ్మిదిమందికి తీవ్ర గాయాలు అయ్యాయి. పక్కింటిలో వున్న వ్యక్తి బెజంకి నారాయణ స్వామి మృతి చెందాడు. భారీగా  పేలుడుకు చుట్టుపక్కల ఇళ్లు కుడా ధ్వంసం అయ్యాయి.  మరికొన్ని ఇళ్ల గోడలు పగిలాయి. క్షతగాత్రులను గాంధీ అసుపత్రికి తరలించారు. ఘటన విషయం తెలియగానే శాసనసభ ఉప సభాపతి పద్మారావు గౌడ్, స్థానిక కార్పోరేటర్ రాసూరి సునీత, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. భారీ ఆస్తి నష్టం జరిగిని ఘటనలో గ్యాస్ సిలిండర్ కాదని ఇంకేదైనా ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు.

 

Tags: Gas cylinder explosion..one killed

Post Midle
Post Midle