ట్యాంకర్ నుంచి గ్యాస్ లీక్… ఆరుగురు మృతి
గుజరాత్ ముచ్చట్లు:
గుజరాత్ లోని సూరత్‌లో గురువారం వేకువజామున పెను విషాదం చోటు చేసుకుంది. సాచిన్ ప్రాంతంలోని ఓ ట్యాంకర్ నుంచి కెమికల్ లీకేజీ కావడంతో ఊపిరాడక ఆరుగురు మరణించారు.మరో 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని స్థానికులు హుటాహుటిన సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రోడ్డుపక్కన పార్క్ చేసి ఉన్న ట్యాంకర్ పైపు నుంచి గ్యాస్ లీక్ కాగా క్షణాల్లోనే ఆ వాయువును పీల్చిన విశ్వప్రేమ్ మిల్లులోని కార్మికులు స్పృహ కోల్పోయి అక్కడికక్కడే పడిపోయినట్లు స్థానికులు వివరించారు.అయితే బాధిత కార్మికులంతా ట్యాంకర్‌కు అతి దగ్గరలో నిద్రిస్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని. గ్యాస్ లీక్ కాగానే స్పృహ కోల్పోయిన 26 మంది కార్మికులను స్థానికులు అంబులెన్సులో ఆస్పత్రికి తీసుకువచ్చారని. అయితే వారిలో ఆరుగురు మరణించారని వైద్యులు వెల్లడించారు. మిగతా కార్మికులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Gas leak from tanker … six killed