విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజి

Date:08/05/2020

దిల్లీ ముచ్చట్లు:

విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్‌లో గ్యాస్‌ లీకేజి వల్ల తలెత్తిన పరిణామాలను అదుపులోకి తీసుకొచ్చి తదుపరి నష్టాన్ని నివారించడానికి గుజరాత్‌ నుంచి అత్యవసర ప్రాతిపదికన ప్రత్యేక రసాయనాన్ని అక్కడకు తరలించారు.‘పారా టెర్షియరీ బ్యుటైల్‌ కెటెహాల్‌’ (పీటీబీసీ) అనే ఈ రసాయనాన్ని గుజరాత్‌లోని వ్యాపి పట్టణంలోనే ఉత్పత్తి చేస్తారు.లీకైన గ్యాస్‌ ప్రభావం లేకుండా చేయడానికి విశాఖలో కొంతవరకు వినియోగించారు.మరింతగా పీటీబీసీ రసాయనం పంపించాలని ఎల్జీ పాలీమర్స్‌ అభ్యర్థించడంతో విషయాన్ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌ షా దృష్టికి తీసుకెళ్లగా.. విమానంలో తరలింపునకు ఆయన తక్షణమే అధికారులను ఆదేశించారని ఆ శాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి దిల్లీలో తెలిపారు.500 కిలోల రసాయనాన్ని వ్యాపి నుంచి దమణ్‌కు రోడ్డు మార్గాన, అక్కడి నుంచి విశాఖకు వాయు మార్గాన తరలించినట్లు వివరించారు.

అర్ధరాత్రి మళ్లీ భారీ స్థాయిలో విషవాయువు

Tags: Gas Leakage in LG Polymers in Vishakha

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *