పాకిస్తాన్ లో 143 శాతం పెరిగిన గ్యాస్ ధర

Gas price of 143 per cent in Pakistan

Gas price of 143 per cent in Pakistan

Date:18/09/2018
లాహోర్ ముచ్చట్లు :
కొత్త పాకిస్థాన్‌ను తయారుచేస్తానని అధికారంలోకి వచ్చిన ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం ప్రజలకు దిమ్మదిరిగే షాకిచ్చింది. వంట గ్యాస్ ధరను ఏకంగా 143 శాతం మేర పెంచాలని నిర్ణయించింది. వచ్చే నెల నుంచే ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయి. ఈ ధరల పెంపుతో రూ.9400 కోట్ల అదనపు ఆదాయం పాకిస్థాన్ ప్రభుత్వానికి రానుంది. ఇప్పటికే అప్పుల ఊబిలో కూరుకుపోయిన దేశాన్ని బయటపడేయానికే గ్యాస్ సబ్సిడీలను ఎత్తేయాలని నిర్ణయించినట్లు ఇమ్రాన్ ప్రభుత్వం చెబుతున్నది.
గృహ, వాణిజ్య అవసరాల కోసం వాడే గ్యాస్ బండ ధరలను పెంచాలని కేబినెట్ ఎకనమిక్ కోఆర్డినేషన్ కమిటీ నిర్ణయించింది. పాక్ పెట్రోలియం శాఖ మంత్రి గులాం సర్వార్ ఖాన్ ఈ విషయాన్ని వెల్లడించారు. అతి తక్కువ స్లాబ్‌లో ఉన్న వినియోగదారులకు పది శాతం, అతి ఎక్కువ స్లాబ్‌లో ఉన్న వినియోగదారులకు 143 శాతం మేర గ్యాస్ ధరను పెంచినట్లు ఆయన చెప్పారు.ఈ ధరల పెంపు ప్రభావం 94 లక్షల ఇళ్లపై పడనుంది. అందులో 36 లక్షల కుటుంబాలు దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవాళ్లే కావడం గమనార్హం.
ఇక వాణిజ్య అవసరాల కోసం వాడే గ్యాస్ ధరను 30 నుంచి 57 శాతం వరకు పెంచారు. జాతీయ గ్యాస్ కంపెనీలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని, ప్రస్తుత ధరలకు గ్యాస్ ఇవ్వడం ప్రభుత్వానికి సాధ్యం కాదని మంత్రి సర్వార్ ఖాన్ తేల్చి చెప్పారు. గ్యాస్ ధరలను భారీగా పెంచడంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. అప్పుల భారం నుంచి బయటపడటానికి ఇమ్రాన్ ప్రభుత్వం ఇప్పటికే ప్రభుత్వ ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్న విషయం తెలిసిందే. ప్రధానితోపాటు ఇతర ప్రభుత్వ కార్యాలయాల్లో అదనంగా ఉన్న లగ్జరీ కార్లను అమ్మే పని మొదలుపెట్టింది.
Tags:Gas price of 143 per cent in Pakistan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *