Natyam ad

గ్యాస్ ధరలను తగ్గించాలి -జిల్లా కార్యదర్శి తస్లిమ్

కడప ముచ్చట్లు:


కమర్షియల్ గ్యాస్ తగ్గించిన విధంగా, గృహ వినియోగ దారులకు కూడా గ్యాస్ ధరలను తగ్గించాలని, రాయలసీమ  మహిళా సంఘం జిల్లా కార్యదర్శి తస్లీమ్ అన్నారు.కడప నగరంలోని 35 వ డివిజన్ (నకాశ్ ప్రాంతం)రిజ్వాన్ మసీదు వీధి నందు మహిళలతో కలిసి వాయుబండను ఎత్తుకొని నిరసన తెలియజేశారు. అనంతరం మీడియా విలేకరులతో మాట్లాడు తూ,  కేంద్ర ప్రభుత్వం గ్యాస్ బండలకు రెక్కలు తొడిగిందని, అందుచేత సామాన్య ప్రజలకు  అత్యంత ఎత్తులో గ్యాస్ ధరలు ఉన్నాయని, గ్యాస్ ముట్టుకుంటేనే మంటలు వచ్చేలా,  ధరలు మండుతున్నాయని ఆమె అన్నారు.

 

మహిళ లందరికి ఉచితంగా వంటి గ్యాస్ ను అలవాటు చేసి, అందరినుండి జలగలు రక్తాన్ని పీల్చినట్టు, ప్రజల రక్తాన్ని పీల్చుతున్నారని ఆమె అన్నారు.
ఒకే రకమైన గ్యాస్ ను  తక్కువ సంఖ్య ఉన్న వ్యాపార సముదాయాల కు తగ్గించి,  మొత్తానికి ఏదో తగ్గించినట్టు చూపడం, మీ ప్రచారానికి గొప్పలకు ఉపయోగపడుతుందని,  పేదలు మధ్యతరగతి ప్రజలు కుటుంబ అవసరాలకు  వినియోగించే గ్యాస్ ను కూడా  తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు.కార్యక్రమంలో మహిళాసంఘంనాయకురాలు,మబుఛాన్, మల్లిక, రేస్మా, ఫర్జానా, తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: Gas prices should be reduced – District Secretary Taslim

Post Midle

Leave A Reply

Your email address will not be published.