గ్యాస్ ధరలను తగ్గించాలి

ఏలూరు  ముచ్చట్లు:
పెంచిన వంట గ్యాస్ ధరలను తగ్గించాలని సిపిఎం ఏలూరు నగర కమిటీ ఆధ్వర్యంలో లో ఏ లురు  జ్యూట్ మిల్ సెంటర్ వద్ద శుక్రవారం ఉదయం సీపీఎం ఆధ్వర్యంలో  నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం ఏలూరు నగర కార్యదర్శి  పి కిషోర్ మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా ప్రజలు మహమ్మారి వల్ల ఉపాధి లేక ఆదాయాలు కోల్పోయి, ఆర్థికంగా సతమతమవుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు ఇటువంటి తరుణంలో కూడా ప్రజల పై ఏమాత్రం కనికరం లేకుండా కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం వంట గ్యాస్ ధర 25.50 రూపాయలు పెంచడం అంటే మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు అయిందన్నారు.  బిజెపి ప్రభుత్వం గడిచిన ఏడు మాసాల కాలంలో ఒక్క గ్యాస్ పై నే 240 రూపాయలు పెంచిందని గుర్తు చేశారు. ఇన్ని సార్లు గ్యాస్ ధరలు పెంచుతున్నా కేంద్ర ప్రభుత్వం  ప్రజలకు ఇచ్చే గాస్ సబ్సిడీ మాత్రం పెంచడం లేదని అన్నారు.  అసలు చాలా మంది ప్రజానీకానికి తమ బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ డబ్బులు పడటం లేదని అన్నారు. కేవలం 10, 15 రూపాయలు మాత్రమే సబ్సిడీ రూపంలో కొద్ది మంది ప్రజలకు వస్తుందని గుర్తు చేశారు.  బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి గ్యాస్, పెట్రోలు డీజిల్ ధరలు  పెంచుతూనే ఉన్నదని అన్నారు. దేశంలో ఆయిల్, గ్యాస్ కంపెనీల గుప్పిట్లో పెట్టుకొన్న రిలయన్స్ అంబానీ, గౌతమ్ అదానీ వంటి బడా పెట్టుబడిదారులకు కరోనా ఈ సమయంలో కూడా లాభాలు పది రెట్లు పెరిగాయన అన్నారు. అంటే వారి లాభాలు పెరగడానికి కారణం ప్రభుత్వం ప్రజలపై ఈ విధంగా  ధరలు పెంచటం అని అన్నారు.   కేంద్రంలో బిజెపి bప్రభుత్వం  పేదలను కొట్టి , పెద్దలకు పెడుతుందని విమర్శించారు. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల వల్ల అన్ని రకాల నిత్యావసర సరుకులు ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయని  అన్నారు. బిజెపి ప్రభుత్వం  అవలంబిస్తున్న ఈ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలంతా   వివిధ రూపాల్లో నిరసన లు తెలపాలి అని అన్నారు.   వరుసగా రెండోసారి దేశ ప్రజలు బీజేపీకి అధికారం కట్టబెడితే, బిజెపి ఆ ప్రజల కోసం కాకుండా దేశంలో కార్పొరేట్ సంస్థలు పెట్టుబడిదారుల కోసం పని చేస్తుందని విమర్శించారు. బిజెపి ప్రభుత్వం తన విధానాలను మార్చుకోకుండా ఇదే విధంగా కొనసాగితే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.  పెట్రోల్ ,డీజిల్, గ్యాస్ ధరలు పై ప్రభుత్వం  నియంత్రణ లో ఉంచు కొవాలని డిమాండ్ చేశారు తక్షణమే పెంచిన గ్యాస్ సిలిండర్ ధర 25.50 ను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.  సిపిఎం నగర కమిటీ సభ్యులు వి సాయిబాబు  మాట్లాడుతూ పెరిగే ధరలకు హద్దు లేదు, ఏలే వారికి బుద్ది లేదని విమర్శించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు  బి జగన్నాధ రావు,  కె రవీంద్ర, జి కోటేశ్వరావు, సిహెచ్ దుర్గారావు, అప్పన్న కృష్ణ తదితరులు పాల్గొన్నారు..

 

పుంగనూరులో జగనన్న ఆశీస్సులతోనే పరిశ్రమలు ఏర్పాటు- జిక్సిన్‌ కంపెనీ కార్యక్రమంలో ఎంపి మిధున్‌రెడ్డి

Tags:Gas prices should be reduced

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *