చాముండేశ్వరీ అలయంలో గౌరి వ్రతం

Date:30/11/2020

చిత్తూరు ముచ్చట్లు:

కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలోని భాస్కర్ పేట  చాముండేశ్వరి ఆలయంలో కార్తీక పౌర్ణమి ఘడియలలో అమ్మవారిని భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తూ కేదారేశ్వరగౌరి వ్రతాన్ని భక్తులు భక్తిశ్రద్ధలతో వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఘనంగా నిర్వహించారు.  ఆలయ వేదపండితులు మాట్లాడుతూ  కార్తీకమాసంలో పౌర్ణమి రోజు అత్యంత ప్రాధాన్యం అయినదని  ఈనెలలో చేసే స్నానజపాదులు పున్యగతులను ఇస్తాయని భక్తులు నమ్ముతారు. ఇక ఈనెలలో వచ్చే సోమవారం, ఏకాదశి, ద్వాదశి, పౌర్ణిమ రోజులు అత్యంత పవిత్రం అని భావిస్తారు.కేదారేశ్వరగౌరి వ్రతన్ని ఆచరిస్తే దీర్ఘ సుమంగళి భాగ్యం ఉంటుందని  అన్నారు.భక్తులు మాట్లాడుతూ కార్తీకమాసంలో కేదారేశ్వరగౌరి వ్రతాన్ని  ఆచరించడం వల్ల మహిళలకు సౌభాగ్యకరమైన “ఐదవతనం” కలకాలం నిలుస్తుందని ప్రతీతి. ,కార్తీక కొత్తగా పెళ్లైన స్త్రీలుమాంగల్యానికి అధిదేవత ‘ కేదారేశ్వరగౌరి వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆరాధిస్తే, దీర్ఘ సుమంగళి భాగ్యం పదికాలలపాటు పచ్చగా ఉంటుందనిఅన్నారు. ప్రతి ఏటా  ఆలయంలో  పూజలనునిర్వహిస్తారని,  కేదారి గౌరీ వ్రతం నోచుకున్నవారికి ఆలయ కమిటీ తరఫున పసుపు కుంకుమ జాకెట్  అందిస్తున్నారని అన్నారు.

మార్చిలోగా వంశధార- నాగావళి అనుసంధానం

Tags: Gauri Vratham at Chamundeshwari Temple

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *