గజ్వేల్ లో చెమటోడుస్తున్నారు

-టఫ్ ఫైట్
Date:21/11/2018
మెదక్ ముచ్చట్లు:
గజ్వేల్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా రసవత్తర పోటీ చోటుచేసుకుంది. స్థానికంగా కేసీఆర్ గెలుపుకోసం ట్రబుల్ షూటర్ ఏకంగా స్ట్రగుల్స్‌కు గురవుతున్నాడని పుకార్లు వినిపిస్తున్నాయి.గజ్వేల్ రాజకీయ చరిత్రలో ఎన్నడూ కనీవినీ ఎరగని విధంగా కుల సంఘాలతో భేటీలు ఏర్పాటు చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. .
ఎవరూ ఊహించని విధంగా రాజకీయ పరిణామాలు చోటుచేసుకోవడం గజ్వేల్ నుండి కేసీఆర్ గెలుపొందడం ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం లాంటి పరిణామాలన్నీ చకచకా జరిగిపోయాయి. ఇదిలా ఉంటే కేసీఆర్ నియోజకవర్గానికి రావడంతోనే టీఆర్‌ఎస్ పార్టీ క్యాడర్‌కు బీజం పడినట్లయ్యింది. గజ్వేల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే అంశంపైనే అధికారులకు అదనపు భాధ్యతలు అప్పగించడం, స్థానిక నేతలకు ప్రాధాన్యత కరువవడం మాట అటుంచితే కార్యకర్తలకు దిశానిర్థేశం చేసే నాయకుడి లేమి స్పష్టంగా ముందు కనిపించేది.
కేసీఆర్ సీఎంగా ఎన్నికైన తర్వాత పరిస్థితిలో మార్పు రాలేవిభజించు పాలించు స్టైల్లో ఒక్కో కులసంఘంతో ప్రత్యేకంగా భేటీలు చేస్తూ ప్యాకేజీలతో మూకుమ్మడిగా ఓట్లు రాబట్టుకునేందుకు పావులు కదుపుతున్నట్లు వినికిడి. ఒక్కో కులసంఘానికి ఒక్కోరకమైన హామీలను ఇస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నానా తిప్పలు పడుతున్నారు. 2014 ఎన్నికలకు ముందు గజ్వేల్‌లో టీఆర్‌ఎస్ పార్టీకి కనీసం క్యాడర్ లేదన్న విషయం స్పష్టమే. అమరుల త్యాగాల ఫలితంగా తెలంగాణా సిద్దిస్తే,తమ కుటుంబాలకు సరైన న్యాయం జరగలేదని,కేసీఆర్ మోసం చేశాడని ఆరోపిస్తూ గ్రామాల్లో ప్రచారం నిర్వహిస్తూ  టీఆర్‌ఎస్‌కు ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తున్నారు.అగ్నికి ఆజ్యం తోడైనట్టు కొండ పోచమ్మ ముంపు గ్రామాల బాధితులు సైతం అగ్రహంతో రగిలిపోతూ కారుకు ఓటు వేసేది లేదంటూ ఖరాఖండిగా ప్రకటించాయి.
పైగా ప్రజల్లో పార్టీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటూ పేర్కోంటున్నారు. తమ భూ సమస్యలు పరిష్కరించడంలో విఫలమయ్యారంటూ జంగంరెడ్డిపల్లి,కోత్తపల్లి  గ్రామస్థులు మూకుమ్మడిగా ప్రతిజ్ఞలు చేసి టీఆర్‌ఎస్ నాయకులు ప్రచారానికి గ్రామానికి రావద్దంటూ ఆంక్షలు విధించారు.ఓట్ల కోసం వచ్చే నాయకులను తరిమి కొడతామంటూ ప్రకటన చేస్తున్నారుదు.నియోజకవర్గంలోని నాయకులందరూ ఎవరికి వారే యమునా తీరే అన్న చందంగా వర్గ విభేదాలతో గ్రూపు రాజకీయలకు ఆజ్యం పోయడం పరిపాటిగా మారింది.చాలా వరకు సంచలనాత్మక అంశాలే చోటు చేసుకున్నాయి.
గజ్వేల్ నియోజకవర్గంలోని తూప్రాన్ మండలంలో ఎంపీపీ గుమ్మడి శ్రీనివాస్ పై స్వంత పార్టీ నాయకులే అప్పట్లో  అవిశ్వాస తీర్మాణాన్ని ప్రవేశ పెట్టగా, పరువు సమస్యగా భావించిన హరీశ్ రంగంలోకి తొలుత మెదక్ ఎంపీని దించినా ఫలితం లేకపోవడంతో తనే స్వయంగా అవిశ్వాస యుద్ధం ప్రకటించిన ఎంపీటీసీలను బుజ్జగించే ప్రయత్నం చేశారు. వారు ససేమిరా అనడంతో చేసేదేమిలేక ప్రేక్షక పాత్ర వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.తాజాగా ప్రస్తుతం అనునిత్యం హరీ్‌శ్ పర్యవేక్షణలో ఉండే తూప్రాన్ మండలంలో సీనియర్, జూనియర్ నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు బాహాటంగానే యుద్ధం ప్రకటిస్తున్నారు.ఇది చాలక మాటల తూటాలు పేలుస్తూ, వాదులాటకు దిగుతూ  పార్టీ పరువు బజారుకీడుస్తున్నారు.
ఎన్నికల సందర్భంగా పట్టణంలో కొద్దిరోజుల క్రితమే  స్థానిక నర్సాపూర్ చౌరస్తా వద్ద  గ్రాండ్‌గా ఓ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకు న్నారు. ఇదిలా ఉండగా సీనియర్, జూని యర్లకు మధ్య గ్రూపు రాజకీయాలు మరింత భగ్గుమనడంతో రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా మరో కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం శోచనీయం. నియోజక వర్గంలోని మరికొన్ని మండలా ల్లోనూ ఇదే పరిస్థితి నెలకొన్నట్లు స్వంత పార్టీ నేతలే వ్యాఖ్యాని స్తున్నారు. టీఆర్‌ఎస్ అధిఫ్ఠానం గ్రూపులను అరిక ట్టడంలో విఫలమ వుతున్నారనే భావన కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది.
ఉద్యమం మొదటి నుండి కొనసాగుతున్న  సీనీయర్ నాయ కులకు మరియు ఆయా పార్టీల నుండి ఇటీవలే పార్టీలో వలసలు వచ్చిన నాయకులకు మధ్యన నెలకొం టున్న విభేధాలను పరిష్కరించడంలో మాత్రం ఆయా మండలాల ఇన్‌ఛార్జీలు,’ట్రబుల్ షూటర్’ దృష్టి కేంద్రీకరించడంలో విఫలమవ్వడంతో ఇలాంటి చర్యలు ఉత్పన్నం అవుతున్నట్లు వాదనలు వినిపిస్తున్నాయి.కాగా నాయకుల నడుమ కొరవడిన సమన్వయ లోపం కారణంగా పార్టీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలోనూ విఫలమవుతున్నామని పార్టీ శ్రేణులే చర్చించుకుంటున్నారు.
నాయకుల వ్యవహర శైలి మూలంగా మండల ప్రజల్లో వ్యతిరేఖ భావాలు వ్యక్తమై కారును డ్యామేజ్ చేసేలా మారాయి.ఇదిలా ఉంటే నర్సారెడ్డి లాంటి మాస్ లీడర్ కేసీఆర్‌కు 2014 ఎన్నికల్లో సపోర్టు చేయడంతో విజయం సులువుగా వరించడం,తదనంతరం కారు ఎక్కడం,ఇటీవలే పదవికి రాజీనామా చేయడం, హస్తం తీర్థం పుచ్చుకోవడం,ముఖ్య ప్రత్యర్థి ప్రతాప్‌రెడ్డికి ఆపన్న హస్తం అందించడంతో గజ్వేల్ రాజకీయం సరికొత్త ఉత్కంఠతకు తెరతీసింది.ఈ సంఘటన నియోజకవర్గంలో పార్టీకి ఎదురు దెబ్బ తగిలినట్టయ్యింది.
నర్సారెడ్డితో కొనసాగిన క్యాడర్‌ను వెళ్ళనీయకుండా హరీశ్ కాస్తంత భారీగానే నాయకులకు బుజ్జగింపుల పర్వానికి  శ్రీకారం చుట్టారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.ఎటూ పాలు పోక కనీసం ప్రజల్లో కనీస చరిష్మాలేని నాయకుల ఇళ్ళ చుట్టూ తన్నీరు పలుమార్లు ప్రదక్షిణలు చేయడంతో అధికార పార్టీ అధినేతకు ఓటమి భయం పట్టుకుందని ప్రత్యర్థి పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే కేసీఆర్‌కు గెలుపు కోసం కంకణం కట్టుకొని,మెజార్టీ విషయంలో లక్ష్యే లక్ష్యంగా ముందుకు సాగుతున్న హరీశ్‌కు ఈ సంఘటనలు సవాల్‌గా మారాయి.
టీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గతంగా కొనసాగుతున్న గ్రూపులను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఇదే అదునుగా  ఇరువురు ప్రత్యర్ధి వర్గం ’రెడ్లు ’ పావులు కదుపుతున్నారు.అయితే ఇటీవలే గజ్వేల్లో కేసీఆర్ ఓటమే లక్ష్యంగా పని చేస్తామని బహిరంగగానే ప్రకటించి అమరవీరుల కుటుంబాలు జగదేవ్‌పూర్ మండలం నుండి యాత్రను ప్రారంభించి, టీఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా ప్రచారాన్ని షూరూ చేశాయి.
ప్రతికూల పరిస్థితులు నియోజకవర్గంలో చోటుచేసుకుంటే లక్ష్య మెజార్టీ సాధిస్తామని, ప్రత్యర్థుల డిపాజిట్లు గల్లంతవ్వడం ఖాయమని హరీశ్‌రావు ధీమాగా ప్రకటించడం చూస్తుంటే ట్రబుల్ షూటర్ ఓట్ల వేటలో ఎంతమేర ’స్ట్రగుల్’కు గురవుతున్నాడని సొంత పార్టీ నేతలే చర్చించుకుంటున్నారు. కేసీఆర్‌కి విజయాన్ని కట్టబెట్టడం మాట అటుంచితే,లక్ష మెజార్టీ సాధించడంలో ట్రబుల్ వ్యూహం ఎంత మేరకు సక్సెస్ అవుతుందో వేచి చూడాల్సిందే.
Tags: Gazelle is sweating

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *