జీవీ ప్రకాష్ కుమార్ ‘సర్వం తాలమయం’ సినిమా టీజర్, ఫస్ట్ లుక్ విడుదల..!!

Date:24/11/2018
హైదరాబాద్‌ముచ్చట్లు:
జీవీ ప్రకాష్ కుమార్ హీరోగా నటించిన ‘సర్వం తాలమయం’ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యింది.. ఈ పోస్టర్ లో జీవీ ప్రకాష్ బ్రాహ్మణ గెటప్ లో , చేతిలో మృదంగంతో  కనిపిస్తూ అందరిలో ఆసక్తి రేకెత్తిస్తున్నాడు.. కాగా ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఈ చిత్ర టీజర్ ని విడుదల చేశారు..రాజీవ్ మీనన్ దర్శకత్వం వహిస్తుండగా, అపర్ణ బాలమురళి హీరోయిన్ గా నటిస్తుంది.. నెడుముడి వేణు, వినీత్, దివ్యదర్శిని ఇతర ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు..ఏఆర్ రెహమాన్ సంగీతం సమకూరుస్తున్న ఈసినిమా తెలుగులోనూ తమిళ టైటిల్ తోనే  విడుదల అవుతుండడం విశేషం..రవి యాదవ్ సినిమాటోగ్రఫీ ని అందిస్తున్నారు.. మైండ్ స్క్రీన్ సినిమాస్ పతాకంపై లత ఈ సినిమాను నిర్మిస్తుండగా  డిసెంబర్ 28 న చిత్రం విడుదల కానుంది.
నటీనటులు: జి.వి.ప్రకాష్ కుమార్, అపర్ణ బాలమురళి, నెడుముడి వేణు, వినీత్, సంతా ధనంజయన్, కుమార్వెల్, దివ్యదర్శిని, సుమేష్, అథిర పాండిలక్ష్మి..
Tags: Geev Prakash Kumar ‘Sarvam Talamayam’ Teaser, First Look Release

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *