జనరల్‌ సెక్రటరీలు హరినాథరెడ్డి, రాజశేఖర్‌రెడ్డికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి సన్మానం

General Secretary Harinath Reddy, Rajasekhar Reddy MLA Pendired Reddy Honor

General Secretary Harinath Reddy, Rajasekhar Reddy MLA Pendired Reddy Honor

Date:15/11/2018

పుంగనూరు ముచ్చట్లు:

రాజంపేట పార్లమెంటరీ నియోజకవర్గ జనరల్‌ సెక్రటరీలుగా నూతనంగా నియమితులైన హరినాథరెడ్డి, రాజశేఖర్‌రెడ్డికి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి శాలువ కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన నాయకులు మాట్లాడుతూ రాజంపేట పార్లమెంటరీ పరిధిలో వైఎస్‌ఆర్‌సిపిని పటిష్టపరుస్తామన్నారు. పార్టీ ప్రవేశపెట్టిన నవరత్నాల కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి , వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు శాయశక్తుల కృషి చేస్తామన్నారు. జనరల్‌ సెక్రటరీలుగా నియమించిన ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ ఎంపి పెద్దిరెడ్డి వెంకట మిధున్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పార్టీ నేతలు దేశిదొడ్డి ప్రభాకర్‌రెడ్డి, రామక్రిష్ణారెడ్డి, నవీన్‌, రామక్రిష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఆటోనగర్‌ ఏర్పాటుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి హామి

Tags: General Secretary Harinath Reddy, Rajasekhar Reddy MLA Pendired Reddy Honor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *