స్థానికాలయాల్లో అభివృద్ధి పనులపై జెఈవో సమీక్ష

Geo Review on Development Jobs in Local Places

Date:26/03/2019

తిరుమల ముచ్చట్లు :

టిటిడి స్థానికాలయాల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల ప్రగతిపై తిరుపతి జెఈవో బి.లక్ష్మీకాంతం తిరుపతిలోని  పద్మావతి విశ్రాంతి గృహంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ తిరుచానూరులోని పద్మావతి అమ్మవారి ఆలయంలో భక్తులు వేచి ఉండేందుకు వీలుగా పాత అన్నదానం భవనంలో కుర్చీలు, ఫ్యాన్లు, లైటింగ్‌ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. అన్ని ప్రాంతాల్లో ఒకేవిధంగా ఉండేలా ఏకరూప సూచికబోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. అదేవిధంగా స్టోర్‌ గదిని మార్చాలని, డిస్పెన్సరి, ప్రచురణల విక్రయశాల, పాదరక్షల కౌంటర్‌ను మార్చాలని, ఆగుమెంటేషన్‌ రియాలిటి టెక్నాలజీ కోసం శుక్రవారపుతోటలో తగిన ఏర్పాట్లు చేపట్టాలని ఆదేశించారు. పద్మావతి నిలయం వద్ద భక్తులకు కనిపించేలా పెద్ద సైజులో బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. అదేవిధంగా తిరుపతిలోని శ్రీగోవింద రాజస్వామివారి ఆలయం, శ్రీ కపిలేశ్వరాలయం, శ్రీ కోదండరామాలయం వద్ద భక్తులను ఆకట్టుకునేలా పలు అభవృద్ధి పనులు చేపట్టాలని సూచించారు.

 

 

 

 

ఈ సమావేశంలో టిటిడి న్యాయాధికారి  రమణనాయుడు, చీఫ్‌ ఇంజినీర్‌ సి.చంద్రశేఖర్‌రెడ్డి, ఎస్‌ఇ -1  ఎన్‌.రమేష్‌రెడ్డి, డెప్యూటీ ఈవోలు   గౌతమి, వరలక్ష్మి,  ఝాన్సీ, విజీవో  అశోక్‌కుమార్‌ గౌడ్‌ ఇతర అధికారులు పాల్గొన్నారు.

 

బాలయ్య కోసం భార్య ప్రచారం

Tags:Geo Review on Development Jobs in Local Places

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *